పూరీ జగన్నాథ్ ..ఓవర్ యాక్షన్
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ ఎప్పుడూ క్రేజీగా ఉంటే టైటిల్స్ తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటూంటారు. తాజాగా ఆయన తన బ్యానర్ పై చేసే చిత్రానికి 'ఓవర్ యాక్షన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఆయన అశోశియేట్ డైరక్ట్ చేస్తారని, చాలా తక్కువ బడ్జెట్ లో తయారయ్యే కామెడీ చిత్రమని తెలుస్తోంది.
ఓ పాపులర్ కమిడయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాసం ఉంది. పూరి తన బ్యానర్ పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మేరకు రీసెంట్ గా కథ విన్న పూరి తన బ్యానర్ పైనే నిర్మిస్తానని ఆ దర్శకుడుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరీ డైలాగులు రాసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై నిర్మించిన హార్ట్ ఎటాక్ చిత్రం విజయం సాధించింది.

ఇక ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది. ఈ చిత్రానికి సంభందించిన కథని ఇప్పటికే పూరీ ఓకే చేయించుకున్నట్లు సమాచారం.
అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.


Click it and Unblock the Notifications











