'కెమెరామేన్ గంగతో...'లో ఆ స్వామిపై సెటైర్స్
సాధారణంగా పూరీ జగన్నాధ్ సినిమా అంటేనే సెటైర్స్ తో నిండి ఉంటుంది. దానికి తోడు మంచి ఊపు మీద ఉన్న పవన్ కళ్యాణ్ కలిస్తే ఇంకైమైనా ఉందా. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు సూటిగా తగిలే వ్యంగ్య బాణాలు చాలానే ఉన్నట్లు సమాచారం. అయితే ఆ బాణాలు గురి ఈ సారి స్వామి నిత్యానందపై పై పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. ఆ క్రమంలో అతను ఓ స్వామిని పట్టుకోలని స్టింగ్ ఆపరేషన్ చేయటం,అక్కడ జరిగే పరిణామాలు హిలేరియస్ గా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఆ స్వామి గెటప్ నిత్యానందను పోలి ఉండనుందని తెలుస్తోంది. హాట్ టాపిక్ గా మారిన నిత్యానంద రాసలీలలు పై వ్యంగ్య బాణాలు ఈ సినిమాకు హైలెట్ అవుతాయని వినికిడి.
తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు,సాంకేతిక నిపుణులు వివరాలు
బ్యానర్ : యూనివర్సల్ మీడియా
నటీనటులు:పవన్ కళ్యాణ్,కాజల్ అగర్వాల్,ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











