»   »  'పులి' తర్వాత పవన్.. పూరి దర్శకత్వంలో నే?

'పులి' తర్వాత పవన్.. పూరి దర్శకత్వంలో నే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan
పూరీ,పవన్ ల కాంబినేషన్ లో పులి చిత్రం తర్వాత ఓ చిత్రం రూపొందనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది ఆశ్చర్యకరమైన వార్తే అయినా ప్రస్తుతం ఫిల్మ్ నగర్ అంతటా చెప్పుకుంటున్న విషయం. అలాగే నిర్మాత కూడా మరెవరో కాదు..దాదాపు వందకు పైగా చిత్రాల్లో కమేడియన్ గా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొన్న నటుడు గణేష్. ఈ మధ్యనే అతను తనకు నటన తో పాటూ చిత్ర నిర్మాణం మీద కూడా చాలా కాలం గా ఇంట్రెస్ట్ వుందని త్వరలోనే తాను ఒక చిత్రాన్ని నిర్మించనున్నాననీ, నల్లమలుపు బుజ్జి, దిల్ రాజు లను ఆదర్శం గా తాను సంవత్సరానికి ఒక్క చిత్రాన్నైనా నిర్మిస్తాననీ ఆయన ఇటీవల కొంత మంది మీడియా వారి దగ్గర అనన సంగతి విదితమే.

అలాగే గతంలో పవన్ కళ్యాణ్,రేణు దేశాయి కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించిన బద్రి సినిమా మంచి విజయం సాధించింది. అప్పటినుంచీ వేరే సినిమా వీరి కాంబినేషన్ లో రాలేదు. వీటికి సంభందించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గణేష్ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతోనే పవన్ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపారని సమాచారం.

ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం నేనింతే షూటింగ్ లో బిజీ గా వున్నారు. దీని తర్వాత సాయిరాం శంకర్ హీరోగా ఒక చిత్రం చేయనున్నారు. ఒక రకం గా చూస్తే పూరి జగన్నధ్ వరుస సినిమాలతో పూర్తి బిజిగా వున్నారు. మరి పవన్ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తారు అన్నది చూడాల్సిందే. అలాగే దశరధ్ తో ఇటీవల స్వాగతం చిత్రాన్ని నిర్మించిన ఆదిత్యరాం పూరి జగన్నధ్ తో టై అప్ అయ్యి దాదాపు వంద కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారనీ, వీరిద్దరు కలిసి వరుసగా సినిమాలు తీయనున్నరని కూడా తెలుస్తుంది. మరి వీటిలో జరిగేది ఏంటి అన్నిది వేచి చూడాల్సిన విషయం. ఏదైమైనా గణేష్ వంటి నటుడుని నిర్మాతగా మార్చి సినిమా తీయటమన్నది జరిగితే పవన్ సినిమాల్లో చెప్పే సిధ్ధాంతాలను నిజ జీవితంలోనూ అమలు పరుస్తున్నట్లే అని అందరూ అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X