twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సియాకి... పూరీ స్పెషల్ షో

    By Staff
    |

    Puri Jagannath
    పూరీ జగన్నాధ్ తన సినిమాల్లో హీరో, హీరోయిన్లుకు ప్రత్యేకమైన కారక్టరైజేషన్ ఇవ్వటం హిట్ కొట్టడం తెలిసిందే. అలా వచ్చినవే 'అమ్మా...నాన్న ...తమిళ అమ్మాయి' లో అసిన్ పాత్ర, 'దేశముదురు' లో అల్లు అర్జున్ పాత్ర. ఇప్పుడాయన రవితేజా హీరోగా సినీ ప్రపంచం నేపద్యంలో 'నేనింతే' అనే సినిమాను తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కొత్త ముంబాయి అమ్మాయి సియాను ఎంపిక చేసారు. కానీ అక్కడున్న ఆ అమ్మాయికి పూరీ టాలెంటు తెలియదు కదా !

    అందుకే ఆమెకి 'పోకిరి' సినిమా స్పెషల్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో వేసి చూపాడుట. దాంతో ఆమె ఆయన టాలెంటుకు, టేకింగుకు దాసోహమని...అమాంతంగా గౌరవం పెంచేసుకుందిట. ఇంతకీ ఈ సినిమాలో సియా డాన్సర్ పాత్ర పోషిస్తోందని సమాచారం. ఇక రవితేజ పాత్ర అసెస్టింట్ డైరక్టర్ గా క్లాప్ బోర్డు పట్టుకుంటాడని చెప్పుకుంటున్నారు. యేదైమైన పూరీ కొత్త రకం ఈ ఎక్సపరమెంట్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ట్రెండు ని ఫాలో అయ్యి మరికొంతమంది కొత్త హీరోయిన్లును ఇంప్రెస్ చేసేద్దామనుకుని తమ సినిమాలు చూపిస్తే సీను రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X