twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ,నితిన్ చిత్రం షూటింగ్ ఏ దేశంలో ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : బ్యాంకాక్ వదిలి పూరీ జగన్నాథ్...పూర్తిగా స్పెయిన్ మీద పడినట్లున్నారు. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు షూట్ చేసిన స్పెయిన్ లో ..నితిన్ తో తను తీయబోయే తాజా చిత్రం షూట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్కడ మేజర్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

    రెండు వరుస విజయాలతో మంచి జోష్‌ మీదున్న నితిన్‌ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతోంది. గతంలో వైష్ణో అకాడమీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని తను ప్రారంభించిన కొత్త బ్యానర్ పూరీ జగన్నాథ్ టాకీస్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి వీరి కలయికలో తెరకెక్కే ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

    ఈ విషయాన్ని హీరో నితిన్‌ తెలియజేస్తూ, 'పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ఆయన చెప్పిన సబ్జెక్టు వినగానే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్‌ చేద్దామా! అన్న ఆతృత మొదలైంది. వ్యాపారాత్మక అంశాలు ఉన్న ఓ విభిన్నమైన ప్రేమకథ ఇది. ఈ నెలాఖరు నుంచి నిరవధికంగా యూరప్‌, గోవాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్స్‌ జరుగుతాయి. తప్పకుండా నా కెరీర్‌లో ఈ చిత్రం మరో మలుపు అవుతుందన్న నమ్మకం ఉంది. నా సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. మిగిలిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని అన్నారు.

    బాలీవుడ్ భామ ఆద శర్మని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈమె ఫిర్,1920 చిత్రాలు చేసింది. నితిన్ కి ఆమె కరెక్టు పెయిర్ అని ఫోటో షూట్ చేసి పూరి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. షూటింగుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌.

    English summary
    Now, Puri Jagannadh has shifted focus to Spain European city. He shot almost entire film of Iddarammayilatho starring Allu Arju there. Now, he is planning to film major sequences of his next film H eart Attack in and around Barcelona. Starring Nithin and Adha Sharma, Heart Attack is a love story that will commence its regular shoot this month end.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X