పూరి కొడుకు హీరోగా లాంచ్...డిటేల్స్
హైదరాబాద్ :పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ హీరోగా లాంచ్ కానున్నాడు. అయితే ఓ రీమేక్ తో అతన్ని లాంచ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రసాద్ ప్రొడక్షన్స్ పై రమేష్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో ఆకాష్ లాంచ్ అవనున్నాడని తెలుస్తోంది.
‘టైం పాస్' అనే మరాఠి చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో ‘ఋషి', ‘అంకుల్'సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ మాదిరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. . ఈ చిత్రానికి చెందిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా తెలియజేసే అవకాశం ఉంది.

ఇక పూరి కొడుకు ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్', ‘బుజ్జిగాడు', ‘ధోని' మొదలైన సినిమాలలో బాల నటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో నటించటానికి పూరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆకాష్ ఈ చిత్రంతో హిట్ కొడితే నెక్ట్స్ తన తండ్రి డైరక్షన్ లో నే సినిమా చేయవచ్చు.


Click it and Unblock the Notifications











