twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రక్త చరిత్ర' టైప్ లో 'బిజినెస్ మ్యాన్'ని పూరీ

    By Srikanya
    |

    Puri Jagannath
    రామ్ గోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్ర గుర్తుండే ఉంటుంది. అందులో వర్మ సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా తన వాయిస్ తో కథను నడిపిస్తాడు. కథకు జరిగిన కథ అన్నట్లు లుక్ ఇచ్చేందుకు ఈ డాక్యుమెంటరీ విధానంలో అప్పుడు ఆయన కథను తన మాటలతో నేరేట్ చేసారు. ఇప్పుడు అదే పద్దతిని పూరీ చేసాడని సమాచారం. బిజినెస్ మ్యాన్ చిత్రంలో పూర్తిగా పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో నడవనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభంలోనే పూరీ .. ముంబై గ్యాంగ్ వార్ లు,డాన్స్ ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించి,చివరి దాకా అక్కడక్కడా తన వాయిస్ ని వినిపిస్తూ నడిపిస్తాడని చెప్పుకుంటున్నారు.

    అయితే రక్త చరిత్రలో ఆయన వాయిస్ అందరినీ చిరాకు పరుస్తూ నడిచింది. మరి పూరీ ఈ చిత్రానికి తగిన జాగ్రత్తలు తీసుకునే నడిపించి ఉండవచ్చు. ఇక ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో ముంబైకి డాన్ అవ్వాలనుకుని బయిలుదేరిన ఓ కుర్రాడు కధ ఇది. ఈ చిత్రం కథ ఐడియాని వర్మ ఇచ్చారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ భారీగా నిర్మించిన ఈ చిత్రం భారీ సంఖ్యంలో ప్రింట్స్ వేసి విడుదల చేస్తున్నారు. దూకుడు తర్వాత మహేష్ కు వచ్చిన క్రేజ్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే పూరీ,మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి కూడా మెగా హిట్ కావటంలో ప్రేక్షకులలలో మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    Puri Jagan, who has directed Prince Mahesh Babu’s upcoming action entertainer ‘Businessman’, has also provided a voiceover for the movie as per sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X