‘గబ్బర్ సింగ్’ లాభాలు... పూరికి భారీ మొత్తం!
గబ్బర్ సింగ్ చిత్రానికి భారీ లాభాలు రావడానికి....దర్శకుడు పూరి జగన్నాథ్‌కి భారీ మొత్తం అందడానికి లింకేమిటి అనుకుంటున్నారా?...ఉంది కాబట్టే ఇక్కడ ఈ చర్చ వచ్చింది. గబ్బర్ సింగ్ చిత్రానికి భారీ లాభాలు రావడంతో పూరి జగన్నాథ్‌కి రెమ్యూనరేషన్ పరంగా కలిసొచ్చింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తీయబోయే సినిమాని నిర్మించే అవకాశం 'గబ్బర్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ విజయంతో గణేష్ బాగా సంపాదించడంతో.....తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తేనే నీతో సినిమా చేస్తా అని కొండెక్కి కూర్చున్నాడట పూరీ. ఎలాగైనా పెద్ద దర్శకులతో చేసి వరుస హిట్లు కొట్టాలని ఊబలాటంగా ఉన్న గణేష్ పూరి చెప్పిన మొత్తం ఇవ్వడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఈ మొత్తం దాదాపుగా రూ.7 నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
బండ్ల గణేష్‌కి పూరి జగన్నాథ్ చెప్పిన కథ విపరీతంగా నచ్చేయడం, తప్పకుండా హిట్టయి తనకు లాభాలు తెస్తుందనే భరోసా కూడా ఏర్పడటంతో పూరికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు గణేష్. ఇంతకముందు పూరి మరియు బన్నీల కాంభినేషన్లో వచ్చిన 'దేశముదురు' మంచి విజయం సాదించడం కూడా సినిమాపై అంచనాలు పెంచుతుందనే నమ్మకంతో ఉన్నాడు గణేష్.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ''కెమెరామెన్ గంగతో రాంబాబ'' చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పూరి-రవితేజ కాంబినేషన్లో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











