పూరి జగన్నాథ్ కి ఏమైంది... ఇలా చేస్తున్నాడు?

By Srikanya

Puri wants to direct Sriram Raghavan story
హైదరాబాద్ : తన చిత్రాలకు తనే కథ,మాటలు రాసుకుని డైరక్షన్ చేసుకునే పూరీ జగన్నాథ్ ఈ మధ్యన రూటు మార్చారు. వక్కంతం వంశీ కథని ఓకే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఎన్టీఆర్ తో సినిమా కోసం తప్పలేదని అన్నారు. అయితే ఇప్పుడు మరో చిత్రం వేరే వారి కథతో ఓకే చేసారని సమాచారం. అది మరేదో కాదు..దగ్గుపాటి రానా హీరోగా...శ్రీరామ్ రాఘవన్ కథతో అని తెలుస్తోంది. అంటే దగ్గుపాటి రానా లాంటి ఫ్లాఫ్ హీరో కోసం కూడా పూరి ఇంత దిగిరావాలా అని అంటున్నారు.

బాలీవుడ్ కి చెందిన శ్రీరామ్ రాఘవన్...ఓ కథతో దగ్గుపాటి రానాని ఎప్రోచ్ అయ్యాడట. అయితే రానా కి తెలుగులోనే హిట్ కొట్టాలనే కోరిక ఉండటంతో తెలుగులో ఆ కథను తెరకెక్కించమని చెప్పారట. అయితే తాను హింది వదిలిరానని తెగిసే చెప్పటంతో అదే కథతో పూరీ ని సినిమా చేయమని అడిగారట. మంచి రెమ్యునేషన్ ఆఫర్ చేయటంతో పూరి ఓకే చేసాడని అంటున్నారు. ఈ చిత్రం నలుగురు కుర్రాళ్లు రోబరి కథతో సాగుతుందని తెలుస్తోంది. పూర్తి స్ధాయి ట్విస్ట్ లతో సినిమా ఉండనుందని సమాచారం. గతంలో శ్రీరామ రాఘవన్...ఏక్ హసీనా థీ, జానీ గద్దర్ చిత్రాలకు రచన చేసారు.

ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు. మంగళవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు.

పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. అతి త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.

మరో ప్రక్క తాజాగా ఆయన తన బ్యానర్ పై చేసే చిత్రానికి 'ఓవర్ యాక్షన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ఎప్పుడూ క్రేజీగా ఉంటే టైటిల్స్ తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటూంటారు. ఈ చిత్రాన్ని ఆయన అశోశియేట్ డైరక్ట్ చేస్తారని, చాలా తక్కువ బడ్జెట్ లో తయారయ్యే కామెడీ చిత్రమని తెలుస్తోంది.

ఓ పాపులర్ కమిడయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాసం ఉంది. పూరి తన బ్యానర్ పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మేరకు రీసెంట్ గా కథ విన్న పూరి తన బ్యానర్ పైనే నిర్మిస్తానని ఆ దర్శకుడుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరీ డైలాగులు రాసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై నిర్మించిన హార్ట్ ఎటాక్ చిత్రం విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X