"పుష్ప 2" మేకర్స్ షాకింగ్ డెసిషన్? 18 నిమిషాలు ఎక్స్ట్రా సీన్స్ తో ఆరోజు నుంచి?
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గర విపిస్తున్న వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా చిత్రం పేరు పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు అందుకొని కొత్త చరిత్ర సెట్ చేస్తోంది. ఆల్రెడీ హిందీ మార్కెట్‌లో బాహుబలి 2, పఠాన్, జవాన్, లేటెస్ట్ గా స్త్రీ 2 ని కూడా క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఇపుడు ఇంకా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుంది పుష్ప 2.
ఇలా ఈ 2024 ఏడాదికి ఒక రికార్డు గ్రాసర్ గా నిలవడమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా కొత్త లెక్కలు సరిచేస్తూ వెళ్తోంది . కాగా పుష్ప 2 సినిమా విషయంలో చాలానే అంశాలు రిలీజ్ కి ముందు ఇబ్బందులు, అడ్డంకులుగా అనిపించాయి. కానీ అవన్నీ దాటి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్‌ని ఈ చిత్రం అందుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఏకంగా 3 గంటల 20 నిమిషాల మేర సినిమాని కట్ చేశారు అని రన్ టైం పట్ల ఎలాంటి వార్తలు వచ్చాయో అందరికీ తెలుసు.

కానీ ఈ సినిమా అంతకు మించే అనుకున్న అంచనాలు దాటి హిట్ అయ్యింది. అంతేకాదు.. ఓ సినిమాకి నిడివితో సంబంధం లేదు అని గత ఏడాది ఆనిమల్ సినిమా తర్వాత పుష్ప 2 కూడా ప్రూవ్ చేసింది. ఇదిలా ఉండగా ఇపుడు పుష్ప 2 రన్ టైం విషయంలో మరో షాకింగ్ రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటి అంటే పుష్ప 2కి ఇంకో 18 నిమిషాలు అదనంగా జోడించి మేకర్స్ కొత్త ప్లాన్ చేస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
దీనితో పుష్ప 2 ఏకంగా 3 గంటల 40 నిమిషాల నిడివి మేర సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనుంది అని చెప్పొచ్చు. ఈ అదనపు నిడివితో పుష్ప 2 ఈ డిసెంబర్ 25 నుంచి థియేటర్స్ లో ప్రదర్శితం అవుతుంది అంటూ టాక్. అది కూడా 3డి వెర్షన్ కి మాత్రమే ఈ వెర్షన్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఆల్రెడీ సినిమాలో చాలా సీన్స్, పాటలు కూడా కట్ చేసేసారు అంటూ టాక్ ఉంది. ఇంకా 3డి వెర్షన్‌ని కూడా రిలీజ్ చేస్తామని తెలిపారు. సో అప్పటి నుంచే పుష్ప 2 హాలిడేస్ ని మళ్ళీ ప్లస్ చేసుకుంటుందేమో అనేది చూడాలి మరి. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రొమాన్స్ చేయగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే ఫహద్ ఫాజిల్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు నటించగా మైత్రి మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అలాగే ఈ సినిమాకు పార్ట్ 3ని కూడా కన్ఫర్మ్ చేశారు.


Click it and Unblock the Notifications











