పుష్ప 2లో బాలీవుడ్ క్రేజీ స్టార్.. ఆ సీన్‌కు థియేటర్లలో కేకలే కేకలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌పై కోట్ల వర్షాన్ని కురిపించింది. ఫలితంగా అత్యధిక వసూళ్లతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
ముఖ్యంగా ఈ చిత్రం హిందీ బెల్టుపై భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించడంతో పాన్ ఇండియా హిట్‌గా సత్తా చాటింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్'ను తీస్తున్నారు. హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పొచ్చు.

మొదటి భాగం కంటే ఇప్పుడు ఎక్కువ బజ్‌ను ఏర్పరచుకున్న 'పుష్ప ది రూల్' మూవీని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్సులతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.
అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో మొదటి పార్టులో ఉన్న వాళ్లతో పాటు చాలా మంది నటీనటులను తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను కూడా ఈ చిత్రంలో నటింపజేస్తున్నారని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో అతడు ఓ గెస్టు రోల్‌లో కనిపించబోతున్నాడట. సెకెండాఫ్‌లో రణ్‌వీర్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని తెలిసింది. అతడు వచ్చినప్పుడు థియేటర్లలో కేకలు మామూలుగా ఉండవట. ఇక, త్వరలోనే అతడు షూట్‌లో పాల్గొంటాడని తెలిసింది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప ది రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











