Pushpa నుంచి మరో షాకింగ్ లీక్.. హీరో గుండె బద్దలయ్యే సీన్.. రంగంలోకి ఫారిన్ బ్యూటీ?

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప తో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి భాగం అన్ని భాషల్లో కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆ సినిమాను అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి తీసుకురావాలి అని పక్క ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్ గా పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన ఒకఆసక్తికరమైన అంశం లీక్ అయినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బలమైన నమ్మకం

బలమైన నమ్మకం

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన మూడవ చిత్రం పుష్ప పార్ట్ 1 తెలుగులో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా అభిమానులలో ముందుగానే ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అయితే మిగతా భాషల్లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఆ అనుమానాలను తలకిందులు చేస్తూ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.

 అనుమానంతోనే రిలీజ్

అనుమానంతోనే రిలీజ్

అసలు పుష్ప హిందీలో సక్సెస్ అవుతుంది అని నిర్మాతలకు కూడా నమ్మకం లేదు. ఏదో పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు అని బయ్యర్లకు ఆ సినిమాను అనుమానంగానే అమ్మేశారు. అయితే ఊహించని విధంగా పది కోట్లకు సినిమా హిందీ లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అలాంటి విజయాన్ని దర్శకుడు హీరో కూడా ఊహించలేదని ఆ తర్వాత తెలియజేశారు.

 పవర్ఫుల్ కంటెంట్

పవర్ఫుల్ కంటెంట్

ఇక ఎన్నో అంచనాలు పెంచుతున్న పుష్పా సినిమా నుంచి తర్వాత రాబోయే సెకండ్ పార్ట్ అంతకుమించి అనేలా ఉండాలి అని చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. అసలైయితే ఇదివరకే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వాలి.. కానీ ప్రస్తుతం పెరుగుతున్న అంచనాల ప్రకారం పవర్ఫుల్ కంటెంట్ తో రెడీ అవ్వాలి అని దర్శకుడు మరోసారి స్క్రిప్ట్ పై కూర్చున్నట్లుగా తెలుస్తోంది.

 హీరో గుండె బ్లాస్ట్ అయ్యే ఎమోషన్

హీరో గుండె బ్లాస్ట్ అయ్యే ఎమోషన్

ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ తో హీరో గుండె బ్లాస్ట్ అవుతుందని తెలుస్తోంది. శత్రువుల కారణంగా తన ప్రేయసి శ్రీవల్లి ని కోల్పోతాడట. హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో చనిపోతుంది అని తెలుస్తోంది.. ఎమోషనల్ సన్నివేశం అనంతరం పుష్పరాజ్ ఒక్కసారిగా చాలా సైలెంట్ గా మారిపోయి నెగిటివ్ పాత్రలో కూడా షాక్ ఇస్తాడు అని తెలుస్తోంది.

Recommended Video

Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
రంగంలోకి ఫారిన్ బ్యూటీ

రంగంలోకి ఫారిన్ బ్యూటీ

ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో సింగపూర్, జపాన్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయట. పుష్పరాజ్ స్మగ్లింగ్ అక్కడి వరకు వెళుతుందట. అయితే సెకండ్ పార్ట్ లో మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ విదేశీ భామను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అంతేకాకుండా సెకండ్ పార్ట్ లో మరో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఆమెతోనే చేయిస్తారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X