Pushpa 2 Release Date: ముందుగానే పక్కా ప్లాన్ తో సిద్దమైన అల్లు అర్జున్.. మళ్ళీ అదే సెంటిమేంట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 16 రోజుల హాలిడే ట్రిప్ నుండి తిరిగి వచ్చిన అనంతరం ఏదైనా ప్రకటన చేస్తాడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే అతను తిందరపడకుండా చాలా ఓపికతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ - బోయపాటి శ్రీను వంటి వారితో వరుసలో సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. పుష్ప విజయంతో బన్నీ ప్రణాళికలను చాలా వరకు మార్చిందని అర్ధమవుతోంది. ఇక ఫైనల్ గా పుష్ప 2 రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరో సినిమాతో

మరో సినిమాతో

వాస్తవానికి పుష్ప 2 సెట్‌లకు వెళ్లే ముందు బన్నీ మరో సినిమాతో రావాలని అనుకున్నాడు. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప సాధించిన అద్భుతమైన విజయం అతనికి కొత్త లక్ష్యాలను పెంచిందనే చెప్పాలి. తరువాత చేయబోయే సినిమాలు అంతకు మించి ఉండాలని ఆలోచిస్తున్నాడు. సుకుమార్ కూడా పుష్ప 2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఐకాన్ లేనట్లే?

ఐకాన్ లేనట్లే?

అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా విషయంలో బన్నీ ఇంకా తన నిర్ణయాన్ని అధికారికంగా చెప్పలేదు. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఆ సినిమాను పక్కన పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో దిల్ రాజు అయితే ఐకాన్ తప్పకుండా ఉంటుందని అన్నారు కానీ బన్నీ అయితే ఇంకా ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

లిస్టులో ఇద్దరు అగ్ర దర్శకులు

లిస్టులో ఇద్దరు అగ్ర దర్శకులు

ఇక బన్నీ లిస్టులో కొరటాల శివతో పాటు బోయపాటి శ్రీను వంటి స్టార్ దర్శకుల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. బోయపాటితో కూడా బన్నీ ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. పుష్ప ఆలస్యం అవ్వడం అలాగే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ సెట్టవ్వడంతో కొరటాల బన్నీ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఇక భవిష్యత్తులో తప్పకుండా బన్నీతో బిగ్ మూవీ ఉంటుందని కొరటాల ఎప్పుడో చెప్పేశాడు.

పుష్ప 2లో మార్పులు?

పుష్ప 2లో మార్పులు?

ఇక పుష్ప సినిమా సీక్వెల్‌తో మరో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ ను అందుకోవాలని అల్లు అర్జున్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. కేవలం కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఆ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అంతే కాకుండా మరో పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ ను కూడా జత చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

రిలీజ్ డేట్ ఫిక్స్?

రిలీజ్ డేట్ ఫిక్స్?

ఇక పుష్ప సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ఇక రెండవ భాగం పుష్ప: ది రూల్‌ని కూడా అదే తరహాలో ఈ ఏడాది డిసెంబర్ 17న మాత్రమే విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకే తరహా సెంటిమెంట్ తో సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Pushpa Movie : Sukumar బిగ్ హార్ట్ .వా ళ్ళందిరికి లక్ష | Allu Arjun | Filmibeat Telugu
ఆలస్యం చేయకుండా..

ఆలస్యం చేయకుండా..

అంటే బన్నీ, సుకుమార్‌లు సినిమాని విడుదల చేయడానికి కొన్ని నెలల ముందే ముందు షూట్ పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ముగించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఖచ్చితంగా 9 నెలల సమయం ఉంది. కాబట్టి వారు ఎటువంటి ఆలస్యం చేయకుండా పక్కా ప్లాన్ తో ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని అనుకుంతున్నారు. అలాగే ప్రమోషన్ విషయంలో కూడా భారీగా ఆలోచించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X