India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pushpa 2: బడ్జెట్ లెక్కలు కథలో మార్పులు.. ఆలస్యంగానే సినిమా రిలీజ్.. ఎప్పుడంటే?

  |

  సుకుమార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన మూడవ సినిమా ఎలా ఉంటుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ పుష్ప సినిమాతో సరికొత్త కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమా ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకని సెకండ్ పార్ట్ పై కూడా అంచనాలను అమాంతంగా పెంచేసింది. ఇక పుష్ప 2 ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రెడీ చేయాలి అనే కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్లో అలాగే కథలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఇక ఫైనల్ గా సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది అనే వివరాల్లోకి వెళితే..

  షాకింగ్ కలెక్షన్స్

  షాకింగ్ కలెక్షన్స్

  స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు సరిగ్గా ప్రమోషన్స్ చేయకుండానే హిందీ లో విడుదల చేశారు. కానీ అక్కడ సినిమా వందకోట్ల కలెక్షన్స్ తో బాలీవుడ్ సినిమాల స్థాయిలో సక్సెస్ అవ్వడం విశేషం.

  టాప్ లిస్టులో పుష్ప 2

  టాప్ లిస్టులో పుష్ప 2

  పుష్ప ఫస్ట్ పార్ట్ ను గత ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచిపోయినా కూడా ఇంకా దానికి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న చిత్రాలలో పుష్ప సెకండ్ పార్ట్ సినిమా టాప్ లిస్టులో ఉండడం విశేషం.

  మరో ఆలోచన?

  మరో ఆలోచన?

  అయితే పుష్ప సెకండ్ పార్ట్ ను వీలైనంత తొందరగా ఇదే ఏడాదిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ ముగిసినప్పుడే అందులోనే సెకండ్ పార్ట్ కు సంబంధించిన చాలావరకు సన్నివేశాలను షూట్ చేసేసారు. దాదాపు 70% సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ అయితే ఫినిష్ అయ్యి ఉంది. కానీ మిగతా 30% షూటింగ్ను అంచనాలకు తగ్గట్టుగా తెరపైకి తీసుకురావాలని అలాగే ఇంతకుముందు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను మరింత గ్రాండ్గా తెరకెక్కించాలనే దర్శకుడు మరో ఆలోచనజూ వచ్చాడు. అందుకోసం కథలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

   భారీ బడ్జెట్

  భారీ బడ్జెట్

  ఫస్ట్ పార్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ 150 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ ప్రాఫిట్స్ అందించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం 400 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. సినిమా షూటింగ్ పూర్తవక ముందే బిజినెస్ చర్చలు కూడా మొదలైనట్లు టాక్. కొంతమంది అడ్వాన్సులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా పుష్ప సెకండ్ పార్ట్ అయితే నిర్మాతలకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది.

  రిలీజ్ అప్పుడే?

  రిలీజ్ అప్పుడే?

  ఇక సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేయడంతో దర్శకుడు సుకుమార్ అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా వారి ప్రణాళికలను మార్చుకున్నారు. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం కథ విషయంలో మార్పులు చేసేందుకు మరి కొంత సమయం ఎక్కువ కావాలి అని చెప్పాడట. ఈ ఏడాది అక్టోబర్లోనే పుష్ప సెకండ్ పార్ట్ కు కావాల్సిన సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఇక సినిమాను మాత్రం మొదట వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ కూడా వర్క్ ఔట్ కాదట. దీంతో 2024 లో నే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

  English summary
  Pushpa 2 movie shooting latest update and release date details,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X