Pushpa 2 Run Time: RRR రికార్డు బ్రేక్! పుష్ప 2 ర‌న్ టైమ్ ఎంతంటే?

Pushpa 2 Run Time: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)- సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ ( ) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 (Pushpa the Rule). ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు హై లెవెల్ లో నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్, టీజర్లతో అంచనాలు అమాంతం పెరిగాయి. అలాగే.. లీక్స్ కూడా బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. తాజా పుష్ప మూవీ రన్ టైం (Pushpa 2 Run Time) కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఆ వివరాల్లోకెళ్తే..

అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి, నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో డిసెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు పాట్నాలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను నిర్వహించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఈ ట్రైలర్ తర్వాత ఫాన్స్ లో మరింత హైబ్స్ క్రియేట్ చేయడానికి ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Pushpa 2 Run Time Allu Arjun Sukumar combo Movie Pushpa 2 comes with a runtime of 3 hours 10 minutes

ఈ భారీ సీక్వెల్‌ మూవీలో అల్లు అర్జున్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. ఈ మూవీకి స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల మాస్ స్టెప్పులు వేసింది. ఎన్నో రూమర్స్ తర్వాత మూవీ యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సాంగ్లో తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ నటించబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, వారు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడగడంతో వారిని సైడ్ చేసి శ్రీలీలను పుష్పటులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ శ్రీ లీల స్టెప్పులు వేస్తుంటే.. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే అని ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.

అలాగే.. పుష్ప 2 మూవీలో హైలెట్ నిలిచే.. గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్లు వెచ్చించారట. సినిమాలో ఈ జాతర ఎపిసోడ్ దాదాపు 15 నుండి 18 నిమిషాల పాటు ఉంటుందనీ, ఇందులోని ఫైట్ సీక్వెల్ కోసం 60 కోట్లు ఖర్చు చేసినట్టు.. ఫైట్ రిహార్సల్స్ కోసం దాదాపు 14 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల‌కుపైగా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు 600 కోట్ల‌కు.. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు 400 కోట్ల వ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలిసింది. ఇక పుష్ప 2 ఓటీటీ హ‌క్కుల‌ను 275 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

Pushpa 2 Run Time Allu Arjun Sukumar combo Movie Pushpa 2 comes with a runtime of 3 hours 10 minutes

ఇదిలాఉంటే.. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 ర‌న్ టైమ్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయ్యింది. ఇప్పటివరకు ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ నిడివి ప్రకారం మూవీ రన్ టైం దాదాపు 3 గంటల 15 నిమిషాల వరకు వచ్చిందట. ఇంకా రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉంటుందట. ఇది కూడా జోడిస్తే.. 3 గంటల 40 నిమిషాల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎడిటింగ్ లో ఎంత కట్ చేసినా.. 3 గంటలు లేదా మూడు గంట‌ల ప‌ది నిమిషాలపైనే ఉండే అవకాశముందట.

ఈ లెక్కన చూస్తే రాజమౌళి తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ RRR మూవీ రన్ టైం ను బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప1 దాదాపు మూడు గంటల నిడివి తో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పుష్ప 2 దాదాపు 3 గంట‌ల ప‌ది నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తెలుగు సినీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ ర‌న్‌టైమ్ మూవీస్‌లో ఒక‌టిగా పుష్ప 2 నిల‌వ‌బోతున్న‌ది. పుష్ప 1 ఫార్ములా ప్రకారం ఈ మూవీ కూడా భారీ హిట్ కొడుతుందని, పుష్పరాజ్ కి ఈ మూవీ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కౌన్సిల వర్షం కురిపిస్తుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X