Pushpa 2: మరో ఐటెమ్ సాంగ్.. అంతకుమించి అనేలా సుకుమార్ ప్లానింగ్!
మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పుష్ప ఫస్ట్ పార్ట్ 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. అంతేకాకుండా సుకుమార్ స్థాయిని కూడా ఈ సినిమా మరింత పెంచింది అనే చెప్పాలి.. ఇక పుష్ప 2: ది రూల్ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం కూడా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అయితే సుకుమార్ మొదటి భాగాన్ని ఎలాగైతే తెరపైకి తీసుకువచ్చాడో రెండవ భాగాన్ని మాత్రం అంతకు మించి అనేలా ప్రజెంట్ చేయాలని చూస్తున్నాడు. ఇక రెండవ భాగంలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

నెగిటివ్ రివ్యూలు రావడంతో
అసలైతే మొదట ఈ సినిమాపై చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా సుకుమార్ తన స్థాయికి తగ్గట్టుగా సినిమాను తెరపైకి తీసుకు రాలేకపోయాడు అని మొదటి రోజే నెగిటివ్ రివ్యూలు రావడంతో సినిమా తప్పకుండా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సినిమా సౌత్ ఇండస్ట్రీ లోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

ప్రభాస్ తరువాత..
పుష్ప సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. హిందీ భాషలో సినిమా 70 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకొని అల్లు అర్జున్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న తెలుగు హీరో గా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు

తొందరపాటులో చాలా మిస్టేక్స్..
మొత్తానికి మొదటి భాగం సక్సెస్ కావడంతో పుష్ప రెండో భాగం ది రూల్ ఎలా ఉంటుంది అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక చిత్రయూనిట్ కాస్త ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. దర్శకుడు సుకుమార్ మొదటి భాగాన్ని మాత్రం చాలా హడావిడిగానే విడుదల చేయాల్సి వచ్చింది. చివరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం తొందరపాటులో చాలా మిస్టేక్స్ కూడా చేసినట్లుగా రివ్యూలు వచ్చాయి.

మరో ఐటెమ్ సాంగ్
ఇక సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం అలాంటి తప్పిదాలు, ఆలస్యం కాకుండా చూసుకోవాలని సుకుమార్ ఓపికతో ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక మొదటి పార్ట్ లో సమంత చేసిన ఊ అంటావా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండవ పార్ట్ లో కూడా అంతకు మించి అనేలా మరొక ఐటమ్ సాంగ్ సెట్ చేయాలి అని సుకుమార్ టీమ్ ఆలోచిస్తోందట. అందుకోసం బాలీవుడ్ లో నుంచి స్టార్ హీరోయిన్స్ ను దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆ స్టార్ ఎవరో..?
పుష్ప 1లో ఊ అంటావా పాట కోసం, మొదట్లో, దిశా పటానీ, నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వారిని సంప్రదించారు, కానీ వారందరూ పారితోషికం మరియు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో సహా అనేక సమస్యల కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. మరి సెకండ్ పార్ట్ లో ఏ స్టార్ హీరోయిన్ తో ఐటెమ్ సాంగ్ చేయిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











