"పుష్ప 2"కి ఈ ప్రాంతాల్లో నష్టాలు తప్పేలా లేవా.. ఎక్కడెక్కడ అంటే?
ఒకప్పుడు సినిమా హిట్టా ఫట్టా అనే మాట ఆ సినిమా థియేటర్స్‌లో ఎన్ని రోజులు ఆడేది అనే దానిని బట్టి చెప్పేవారు కానీ ఇపుడు పరిస్థితి ఇలా లేదు. ఇపుడు థియేటర్స్‌లో తక్కువ సమయం ఉన్నా పర్వాలేదు వసూళ్లు వచ్చేసాయా అన్న దానిపై ఆ సినిమా హిట్ లేదా బ్లాక్ బస్టర్, ఆపై రిజల్ట్‌ని అనౌన్స్ చేస్తున్నారు. మరి ఇలా మారిపోయిన సమయంలో వసూళ్లతో పాటుగా థియేటర్స్‌లో ఎక్కువ రోజులు రన్ అయితే అది బోనస్ అని చెప్పాలి.
ఇప్పుడు పలు చిత్రాలకి మారిన మార్కెట్‌తో భారీ స్థాయిలో బిజినెస్‌లు చేస్తున్నాయి. ఇది ఎలా మారింది అంటే ఓ సినిమా ఎక్కువ వసూలు చేసే దానికంటే ఆ సినిమా చేస్తున్న బిజినెస్‌ని బట్టి కూడా కొలమానాలు మారుతున్నాయి. ఇలా రీసెంట్‌గా ఇండియన్ సినిమా దగ్గర మాట్లాడుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ "పుష్ప 2" అని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజి లోనే ఉండగానే రూ.1000 కోట్ల బిజినెస్ థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ గా చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. చెప్పినట్లుగానే అనూహ్యంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల బిజినెస్ చేసి చూపించింది. సరే ఇది బాగుంది కానీ అసలు పరీక్ష ఇక్కడే ఈ సినిమాకి మొదలైంది. థియేటర్స్‌లో ఈ సినిమా భారీ బిజినెస్‌ని చేసేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 200 కోట్లకి పైగా బిజినెస్ చేసింది.
అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.400 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేస్తే తప్పించి లాభాలు ఈ సినిమాకి రావు. ఇలా ఇతర భాషల్లో ఈ సినిమా మంచి బిజినెస్‌ని చేయగా.. వసూళ్లు పరంగా మాత్రం వాటికీ తగిన కలెక్షన్స్ కేవలం ఒకటీ రెండు భాషల్లో మాత్రమే అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే పుష్ప2కి ఉన్న హైప్‌కి తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ అయ్యింది ఒక్క హిందీ భాషలో మాత్రమేనట.
అంతేకాదు.. అల్లు అర్జున్‌కు బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగులోనే పుష్ప 2 కి నష్టాలు తప్పేలా లేవని ఓ గాసిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఏపీలో అయితే మొదటి నుంచీ ఈ సినిమాపై కొంచెం నెగిటివ్ తో పాటు మెగా ఎఫెక్ట్ కూడా పడింది. దీంతో అక్కడ డల్ అవ్వగా.. నైజాం మార్కెట్‌లో స్టార్టింగ్ ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ ఇపుడు ఈ ఏరియాలోనూ నెమ్మదించింది. దీనితో పుష్ప 2కి తెలుగు రాష్ట్రాలలో స్వల్ప నష్టాలు తప్పవట.

ఇక ఇక్కడే కాకుండా మలయాళ, కన్నడ వెర్షన్‌లలో కూడా జరిగిన బిజినెస్ రేంజ్ వసూళ్లు రావట్లేదని టాక్. దీనితో ఇక్కడా లాసులే మిగిలేలా ఉన్నాయట. ఇక ఇవి కాకుండా యూఎస్ మార్కెట్‌లో కూడా పుష్ప 2కి జరిగిన బిజినెస్‌కి ఇపుడు ఉన్న ట్రెండ్ లో గట్టెక్కడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అక్కడ ఆల్రెడీ 13 మిలియన్ మార్క్ దాటినప్పటికీ ఇంకా అక్కడ రాబట్టాల్సింది చాలా ఉందట.
దీనితో ఈ ప్రాంతాల్లో పుష్ప 2 నెమ్మదించిన నేపథ్యంలో స్వల్పంగా కానీ, అంతకి మించే కానీ నష్టాలు మిగిల్చేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక బాగా సేఫ్ అయ్యింది ఎక్కడ అంటే తమిళ్, హిందీ వెర్షన్‌లకే అని ఫిలింనగర్ టాక్. ఇంట్రెస్టింగ్‌గా మన దేశంలో తెలుగు వసూళ్లు, బుకింగ్స్ కంటే హిందీ మార్కెట్‌లోనే ఎలా ఎక్కువ ఉన్నాయో అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా ఇప్పటి వరకు వచ్చిన 13 మిలియన్ డాలర్స్ వసూళ్లలో మేజర్‌గా హిందీ వసూళ్లే తెలుగు కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











