అల్లు అర్జున్ వర్సెస్ విజయ్ దేవరకొండ .. తెరపైకి కొత్త వార్..

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప2: ది రూల్‌'(Pushpa2 The Rule). ఈ మోస్ట్ అవైటెంట్ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప మూవీపై విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకున్నాయి. విడుదల తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప3' (Pushpa 3) ఉంటుందని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఈ తరుణంలో మరో క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటీ?

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతోంది. అల్లు అర్జున్ -సుకుమార్ ల క్రేజీ కాంబోలో ఈ మూవీ పై విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిస్తోంది. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ ఐటెం సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల మాస్ స్టెప్పులు వేస్తుంది. ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు లీడ్ లో నటిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు.

Pushpa 3 confirmed Vijay Deverakonda likely to play villain role in Allu Arjun Rashmika Mandanna starrer Pushpa 3

శాండిల్ వుడ్ స్మగ్లింగ్ బేస్డ్ గా తెరకెక్కించిన పుష్ప 2 సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్ లలో విడుదల కాబోతుంది. ఇండియాలోనే 6,500, ఓవర్సీస్ లో 500 స్క్రీన్స్ లలో విడుదలకు కాబోతుంది. ఇలా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది.ఈ విడుదలకు ముందు ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ కూడా పుష్ప 2 దుమ్మురేపుతోంది. అత్యధిక వేగంగా 50 వేల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇండియాలో అత్యధిక వేగంగా బుక్ మై షో లో 1 మిలియన్ టికెట్లను అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2 మూవీ తొలి రోజు రూ. 300 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Pushpa 3 confirmed Vijay Deverakonda likely to play villain role in Allu Arjun Rashmika Mandanna starrer Pushpa 3

ఇదెలా ఉంటే.. ఈ సినిమాకు కొనసాగింపుగా 'పుష్ప3' (Pushpa 3) ఉంటుందని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటి పలుమార్లు ఈ విషయం చర్చకు కూడా వచ్చింది. తాజాగా పుష్ప 3 కూడా రాబోతుందనే చెప్పకనే చెప్పారు. తాజాగా ఓ ఫొటో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. అంతేకాదు.. పుష్ప 3 కి సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి పనిచేశారనే టాక్. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలో బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప3' టైటిల్‌ ఉంది. అందులో 'పుష్ప3: ది ర్యాంపేజ్‌' (Pushpa3: The Rampage) ఉండటం విశేషం. ఇప్పటికే పార్ట్‌-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యం ఈవిషయం వెలుగు చూసింది.

ఇదెలా ఉంటే.. పుష్ప 3 లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించబోతున్నారట. అదికూడా విలన్ పాత్రలో. అఫీషియల్ గా ప్రకటించింది లేదు. ఇప్పటివరకు రష్మిక మందాన విజయ్ దేవరకొండలు హీరో హీరోయిన్స్ కం నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న టాక్ ప్రకారం.. పుష్ప3 లో విజయ్ దేవరకొండ విలన్ పాత్రలో ఎలా నటిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ స్వీకెల్ లో విజయ్ దేవర కొండ వర్సెస్ అల్లు అర్జున్ వార్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X