ఆయన వెళ్లిపోవడంతో పుష్పకి కొత్త టెన్షన్.. రెండు రోజులు అయితే అంతా క్లియర్.. కానీ !

ఎన్ని కరోనా కేసులు వస్తున్నా ఆగని పుష్ప సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఆగిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. హై కరోనా రిస్క్ ఉన్నా సరే ఆ రిస్క్ ని బేర్ చేస్తూ సుకుమార్ సహా మిగతా యూనిట్ అంతా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నిజానికి అల్లు అర్జున్ కరోనా సోకినా సరే ఈ సినిమా షూటింగ్ ఆపలేదు.. డేట్స్ సమస్య భవిష్యత్తులో ఏర్పడుతుంది ఏమో అన్న టెన్షన్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. అయితే ప్రతి రోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకి చేరువలో నమోదవుతూ కరోనా కేసులు కలవరపెడుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ కొచ్చిన్ వెళ్ళిపోయారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగినట్లు చెబుతున్నారు.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు బన్నీ. నిజానికి గతంలోనే బన్నీ పుష్ప సినిమా షూటింగ్ ఆపేయాలని కోరాడట.. కానీ ఫాహద్ ఫాజిల్ డేట్స్ దొరకడం కష్టమని భావించి సుకుమార్ షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేశాడని తెలుస్తోంది. అయితే కరోనా భయంతో షూట్ చేయడం తన వల్ల కాదని చెప్పి ఫహద్ ఫాసిల్ వెనక్కి వెళ్ళిపోయాడు అని తెలుస్తోంది..

Pushpa finally halts its shoot after Fahadh Faasil left

అయితే మరో రెండు రోజులు కనుక బన్నీ షూటింగ్ లో పాల్గొన్నట్లు అయితే బన్నీ ఫాసిల్ కాంబినేషన్ లో వచ్చే అన్ని సీన్స్ పూర్తి అయ్యేవి అని తెలుస్తోంది. ఇక అనసూయ, ఫహద్, సునీల్ కాంబినేషన్ లో కూడా కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది. కానీ ఫహద్ ఫాసిల్ వెళ్లిపోవడంతో ఈ సీన్స్ కి కూడా బ్రేకులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టు 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X