పుష్ప లీక్.. అనసూయ పాత్ర గుట్టు తెలిసిపోయింది.. ఈసారి అంతకుమించి అనేలా...

పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటుందో తెలియదు గాని షూటింగ్ దశలోనే కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తోంది. మొదటిసారి దర్శకుడు సుకుమార్ పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేస్తున్నాడు అన్నపుడే అంచనాలు అకాశాన్ని దాటేశాయి. ఇక సినిమాకు సంబంధించిన లీక్స్ కూడా ఒక విధంగా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ కు సంబంధించిన ఒక రూమర్ వైరల్ గా మారింది.

న్యాయం చేసేలా..

న్యాయం చేసేలా..

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారడానికి సమయం వచ్చేసింది అంటూ దర్శకుడు సుకుమార్ ఇటీవల ఫస్ట్ లుక్ ప్రోమో ఈవెంట్ తో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఆ ట్యాగ్ ఎందుకు వేసుకోవాలని అనిపించిందో ఏమో గాని పుష్ప సినిమాతో మాత్తం తప్పకుండా ఐకాన్ స్టార్ ట్యాగ్ కు న్యాయం చేస్తాడని టాక్ వస్తోంది.

యాక్షన్ డోస్ గట్టిగానే..

యాక్షన్ డోస్ గట్టిగానే..

అల్లు అర్జున్ ఇన్నేళ్ల కెరీర్ వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తైతే పుష్ప సినిమా మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఆ విషయం చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. దర్శకుడు సుకుమార్ మొదటిసారి యాక్షన్ డోస్ గట్టిగానే పెంచినట్లు అర్ధమవుతోంది.

హై వోల్టేజ్ పాత్రలో అనసూయ

హై వోల్టేజ్ పాత్రలో అనసూయ

ఇక సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె ఒక హై వోల్టేజ్ పాత్రలో భయంకరమైన లేడి గా కనిపించనుందట. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా పాజిటివ్ పాత్రలోనే ప్రజెంట్ చేశారు. కానీ పుష్పలో మాత్రం పూర్తిగా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తున్నట్లు టాక్.

సునీల్ భార్య పాత్రలోనే..

సునీల్ భార్య పాత్రలోనే..

అంతే కాకుండా ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సునీల్ భార్య పాత్రలోనే అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ను సుకుమార్ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఇక సినిమా షూటింగ్ కు ఏ మాత్రం బ్రేక్ పడకుండా చిత్ర యూనిట్ కోవిడ్ నిబంధనలకు తగ్గట్లుగానే తక్కువమంది స్టాఫ్ తో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X