twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప సినిమాకు భారీ ప్రమాదం.. అలా జరిగితే భారీ నష్టాలు తప్పవు!

    |

    అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీపై తెలుగులో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ హిందీలో అలాగే మిగతా భాషల్లో సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుంది అనేది సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్స్ అనుజున్నంత స్థాయిలో రాకపోవచ్చని దగ్గరలోనే మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ టైమింగ్ చాలా రాంగ్ అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి.

    సుకుమార్ దర్శకత్వంలో తేరకెక్కిన పుష్ప సినిమాపై మాస్ ప్రేక్షకులలో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా కోసం నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడకుండా ఖర్చు చేశారు. ప్రతీ విషయంలోను వారు తీసుకున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఎంతగానో హార్డ్ వర్క్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

    Pushpa movie solo fight with big hollywood movies

    పుష్ప సినిమా ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ తెలుగు మలయాళ కన్నడ భాషల్లో కూడా ఒకే రోజు భారీ స్థాయిలో విడుదల అవుతోంది. తప్పకుండా సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రమోషన్ విషయంలో మిగతా భాషల్లో మాత్రం ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

    ప్రమోషన్ విషయం పక్కన పెడితే పుష్ప సినిమాకు ఓవర్సీస్ లో అయితే గట్టి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా అక్కడ బిగ్గెస్ట్ హాలీవుడ్ మూవీ స్పైడర్ మాన్ కూడా విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న మ్యాట్రిక్స్ సినిమా కూడా ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలు ఓవర్సీస్లో భారీ స్థాయిలో విడుదల అవుతాయి కాబట్టి పుష్ప సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి చిత్ర యూనిట్ ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

    దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే దేవి శ్రీప్ర సాద్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా సినిమా వర్క్ లో నిమగ్నమయ్యారు. వచ్చే శుక్రవారం సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ 5 రోజుల్లోనే ఫైనల్ మిక్సింగ్ లో చిన్న పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ సమయంలో సుకుమార్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా రెగ్యులర్ ప్రమోషన్ లో ఉండాలి. కానీ వర్క్ లోనే వారు బిజీగా ఉండడం వలన మిగతా భాషల్లో ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. మరి అల్లు అర్జున్ సోలోగా సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

    English summary
    Pushpa movie solo fight with big hollywood movies,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X