తగ్గేదేలే అంటూనే వెనక్కి తగ్గుతున్న పుష్ప.. అన్ని లెక్కలు మారడంతో సంచలన నిర్ణయం?

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతుండగా ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్ వ్యవహారం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వెనక్కు వెళ్ళవచ్చు అంటూ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

మొట్టమొదటి సారిగా

మొట్టమొదటి సారిగా

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.

తగ్గేదేలే

తగ్గేదేలే

ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

 మళ్ళీ వాయిదా

మళ్ళీ వాయిదా

అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సునీల్

సునీల్

ఇక మొత్తం మీద ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని తేలింది.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
ఏమవుతుందో?

ఏమవుతుందో?

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సునీల్ మంగళం శ్రీను లుక్, అలాగే అనసూయ దాక్షాయణి లుక్ కూడా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉన్నాయ్. ఈ సినిమాలో ఈ ఇద్దరూ భార్యా భర్తలుగా నటిస్తున్నారు. అయితే పుష్ప సినిమా వాయిదా విషయం మీద త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X