అల్లు అర్జున్ దెబ్బ.. టెన్షన్ లో ఆ రెండు సినిమాల మేకర్స్.. వార్ తప్పదా?

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉండగా ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. అదేంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటూ అంటూ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ అంచనాలు

భారీ అంచనాలు

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి కారణం సుకుమార్ టేకింగ్ మాత్రమే కాక సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుండడం కూడా.

 లారీ డ్రైవర్ పాత్రలో

లారీ డ్రైవర్ పాత్రలో

దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతున్న క్రమంలో చిత్తూరు యాస కూడా నేర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఆ లారీ డ్రైవర్ ఒక డాన్ గా ఎలా ఎదిగాడు ? అనేది ఈ సినిమాగా చెబుతున్నారు.

 రిలీజ్ అవుతుందా?

రిలీజ్ అవుతుందా?

ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటిదాకా విడుదలైన అప్డేట్స్ లో కనిపించింది.

 ఏమీ రెడీ కాకపోవడంతో

ఏమీ రెడీ కాకపోవడంతో

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ లేట్ కాకపోవడంతో సినిమా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా ఫస్ట్ కాపీ ఇంకా రెడీ కాలేదని, ప్రమోషన్స్ లో కూడా జోరు కనపడడం లేదని అంటున్నారు. అలాగే జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాను 24వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

త్వరలోనే ప్రకటన

త్వరలోనే ప్రకటన

ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ, లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప సినిమా వాయిదా విషయం మీద త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

 పరిస్థితి ఏంటి?

పరిస్థితి ఏంటి?

ఒకవేళ పుష్పా సినిమా 24వ తేదీకి వాయిదా పడితే ఆ రోజు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న వరుణ్ తేజ్ గని, నాని శ్యాం సింగరాయ్ సినిమాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పుష్ప తట్టుకోవడం అంటే రెండు సినిమాలకు కాస్త ఇబ్బందికర విషయమనే చెప్పాలి. మరి ఈ విషయంలో పుష్ప ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఈ రెండు సినిమాల మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X