మహేష్ సినిమాకు అడ్డుగా ఆ నిర్మాత.. ఏం జరుగుతోంది!
భరత్ అనే నేను చిత్రంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ సాధించింది. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. దీనితో తదుపరి చిత్రం విషయంలో మహేష్ బాబు పెద్ద ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. తనకోసం రెండేళ్లకుపైగా ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతకు మించి ఉండేలా
భారత్ అనే నేను చిత్రంతో మహేష్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మహేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు. బలమైన సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఉండడంతో భారీ విజయం సాధించింది. తన తదుపరి చిత్రం ఇంతకు మించేలా ఉండలని మహేష్ భావిస్తున్నాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న మహేష్ తదుపరి చిత్రం జూన్ నుంచి పట్టాలెక్కనుంది. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఆ అడ్డంకి తొలగిపోతుందా
మహేష్, వంశీ పైడిపల్లి చిత్రానికి అడ్డుగా ఓ నిర్మాత ఉన్నారు. పీవీపీ నిర్మాణంలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మహేష్ అభిమానులని సైతం నిరాశ పరిచింది. దీనీతో పీవీపీ నిర్మాణంలో వంశి పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

వివాదం మొదలైంది
కానీ ఆ ఒప్పందం అతిక్రమించి మరో నిర్మాణ సంస్థలో మహేష్, వంశి పైడిపల్లి సినిమా చేస్తున్నారని పీవీపీ నోటీసులు పంపారు. ఈ వ్యవహారం తేలేవరకు ఈ చిత్రం ప్రారంభం కావడానికి వీల్లేదంటూ కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు.

పీవీపీకి వాటా
ఈ వివాదంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీసీపీని ఈ చిత్రంలో భాగస్వామిగా చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసిఉంది.


Click it and Unblock the Notifications











