పవన్ కి PVP గ్రూప్ అదిరిపోయే ప్రపోజల్

By Srikanya

హైదరాబాద్ : పీవీపీ అధినేత పొట్లూరి వర ప్రసాద్ కి జనసేన అధ్యక్ష్యుడు,స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి ర్యాపో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పీవీపీ వారు విజయవాడ టిక్కెట్ అడిగారని, అవి వర్కవుట్ కాలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటి నిజానిజాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చర్చ కన్నా ఇప్పుడు వారు పవన్ కి ఆ సంస్ధ నుంచి వచ్చిన ఆఫర్ గురించే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

పీవీపీ సంస్ధ వారు తమ గ్రూప్ లో డైరక్టర్ గా పవన్ కి ఆఫర్ చేసారని సమాచారం. పవన్ తమ గ్రూప్ లోకి వస్తే తమ గ్రూప్ షేర్స్ విలువ పెరుగుతుందని, మార్కెట్ బ్రాండింగ్ కూడా విలువ అధికమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే ఈ ప్రపోజల్ కి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు మిలయన్ డాలర్ల ప్రశ్న.

 PVP has offered the director post to Pawan Kalyan?

''నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది'' అంటూ చెలరేగిపోయిన 'గబ్బర్‌సింగ్‌'ని మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. పవన్‌ కల్యాణ్‌ పలికిన సంభాషణలు, ఆయన చూపించిన తిక్క.. జనాలకు బాగా నచ్చేశాయి. ఆ మత్తులో ఉండగానే... 'గబ్బర్‌సింగ్‌ 2' ప్రకటన వచ్చేసింది. కానీ సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల రెండో 'గబ్బర్‌ సింగ్‌' కాస్త ఆలస్యమయ్యాడు.

అయితే ఇప్పుడు రాజకీయ వేడి కాస్త తగ్గడంతో పవన్‌ దృష్టి సినిమాలవైపు మళ్లింది. దాంతో 'గబ్బర్‌ సింగ్‌ 2' హంగామాకు రంగం సిద్ధమైంది. 'రచ్చ'తో బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంపత్‌నంది దర్శకత్వం వహించే చిత్రమిది. శరత్‌మరార్‌ నిర్మాత. ''గబ్బర్‌ సింగ్‌ కథకూ.. ఈ కథకూ సంబంధం ఉండదు. కానీ ఆ తిక్క మాత్రం ఉంటుంది. అభిమానులకు రెట్టింపు వినోదం అందిస్తాం. స్క్రిప్టు సిద్ధమైంది. కథానాయిక ఎంపిక జరుగుతోంది. పవన్‌ పచ్చజెండా వూపగానే చిత్రీకరణను మొదలుపెట్టేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు.

హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్'కు ఇది ప్రాంచైజీ ఫిల్మ్. ఈచిత్రం సీక్వెల్,ప్రీ క్వెల్ కాదనీ ప్రాచైజీ గా ఫ్రెష్ స్టోరీ తో వచ్చే చిత్రం అని సంపత్ నంది చెప్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే చెప్తామన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తై మిగతా పనులు వేగంగా జరుపుతున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. సోనాక్షి సిన్హా, కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ వారిద్దరికీ డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నట్లు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X