పవన్ తో అనుకుంటే మహేష్ తో ముందుకు

By Srikanya

హైదరాబాద్ : ఆ మధ్యన పవన్ కల్యాణ్, పివిపి సినిమా అధినేత పొట్లూరి వరప్రసాద్ మధ్య ఉన్న స్నేహంతో సినిమా వస్తుందని భావించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు మహేష్ తో పివీపి వారు చిత్రం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2015 లో భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని, ఆ చిత్రం దర్శకుడు మరెవరో కాదని శ్రీకాంత్ అడ్డాల అని చెప్తున్నారు. బ్రహ్మాత్సవం టైటిల్ తో ప్రచారం లో ఉన్న స్క్రిప్టు వీరు నిర్మించేదే అంటున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

మహేష్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మహేష్‌ తర్వాతి సినిమా ఎవరితో తీస్తారనే విషయం ఆసక్తిమారింది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి భారీ హిట్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాలతో మరో సినిమా తీసేందుకు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం.

PVP to Produce Mahesh Films?

శ్రీకాంత్‌ అడ్డాల కూడా వరుణ్‌ తేజ్‌ నటించిన ముకంద ను రిలీజ్‌ చేసి నెక్ట్స్ ప్రాజెక్టు మహేష్ తో అని ఆల్రెడీ ప్రకటించారురు. అడ్డాల శ్రీకాంత్‌ నెక్స్ట్‌ ప్రాజెక్టు మహేష్‌ హీరోగా రూపొందనున్న చిత్రానికి పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వర ప్రసాద్‌ నిర్మించనున్నారని ఫిలింనగర్‌ టాక్‌. మరీ ఇదే నిజమైతే ఫ్యామిలీ బ్యాక్‌ డ్రాప్‌లో తీర్చిదిద్దే శ్రీకాంత్‌, మహేష్‌ను ఎలా చూపిస్తారో మరీ వేచి చూడాలి.

మహేష్ తాజా చిత్రం విషయానికి వస్తే...

మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వేసవిలో మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సంవత్సరం మహేష్ కు చేదు అనుభవమే మిగిలింది. చేసిన రెండు చిత్రాలు ''1'' నేనొక్కడినే, ''ఆగడు '' కూడా ఫ్లాప్ జాబితాలో పడిపోవడంతో కొరటాల తో చేస్తున్న సినిమా హిట్ అయి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాడు మహేష్.

ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆగడు నిరాశని మిగల్చడంతో కొరటాల శివ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ సరసన అందాల భామ శృతి హసన్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X