హిందీలోంచే ఎత్తుకొచ్చి...మళ్లీ హిందిలోకే

కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ దర్శకుడిగా పరిచయమయిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అంతేకాకుండా కాపీ వివాదం మొదలైంది. ఈ కాపీ వివాదమే నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా ద్వారా సమాధానమిచ్చుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రొఫెషనల్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కె.కిషోర్ అనువదిస్తున్నారు.
కె.కిషోర్ మాట్లాడుతూ... ''తెలుగులో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన 'రారా కృష్ణయ్య' చిత్ర అనువాద హక్కులను తీసుకున్నాము. హిందీతోపాటు భోజ్‌పురి వంటి భాషలలో అనువదిస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఇందులోని ఆరు పాటలలో ఓ పాటను శ్రియా గోషాల్ పాడారు. ఈ సినిమాపై కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసారు.
'తేరే నాల్ లవ్ హోగయా' హిందీ రీమేక్‌ను తెలుగులో 'రారా కృష్ణయ్య'గా చిత్రాన్ని చేసారని రూమర్స్ సృష్టించారు. కానీ ఇది తప్పు అని, రారా కృష్ణయ్య చిత్రం హిందీ రీమేక్ కాదని తెలుగు నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ (యస్‌వికె సినిమా) కన్‌ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో నిర్మించారు కాబట్టి అనువాద హక్కులను పొందడం ఆనందంగా వుంది. సెప్టెంబర్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము'' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... రారా..కష్ణయ్య తరహాలో బాలీవుడ్‌లో ఇప్పటి వరకు చెన్నై ఎక్స్‌ప్రెస్, తేరే నాల్ లవ్ హోగయా వంటి తదితర చిత్రాలొచ్చాయి. అయితే గత కొన్నేళ్ల క్రితం స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ డానీ బోయెల్ రూపొందించిన ఏ లైఫ్ లెస్ ఆర్డినరీ చిత్రంలోని ఓ పాయింట్ స్ఫూర్తితో రారా..కష్ణయ్య చిత్రాన్ని రూపొందించాను. మనం ఏదైతే జరగకూడదని అనుకుంటామో అదే జరిగితే ఆ తరువాత మనం పడే సంఘర్షణ ఎలా వుంటుందన్న పాయింట్ నన్ను బాగా ఆ కట్టుకుంది. దాన్ని ప్రధాన కథావస్తునవుగా తీసుకుని ఈ సినిమా చేశాను. కొత్త పంథాలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది అన్నారు.


Click it and Unblock the Notifications











