నిజమా...'రారా కృష్ణయ్య' కాపీనా
హైదరాబాద్ : ఓ సినిమా విడుదల అవుతోందంటే...సినిమా పై క్రేజ్ సంగతి కన్నా...ఆ సినిమాకు మూలమేదన్నా ఉందా అనే తవ్వకాలే ఎక్కువ అవుతున్నాయి. తాజాగా
సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య' విడుదలకు సిద్దమవుతున్న నేపధ్యంలో ఈ చిత్రం రితీష్ దేశ్ ముఖ్, జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన Tere Naal Love Ho Gaya చిత్రం ప్రేరణతో కథ తయారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఒరిజనల్ లో ఉన్న హీరోయిన్ తండ్రి పాత్రను ఇక్కడ హీరోయిన్ కి అన్నగా మార్చారని, అది జగపతిబాబు చేస్తున్నట్లు అంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ నిజం..రూమరా అనేది తేలాలంటే చిత్రం విడుదల కావాల్సింది. ఇంతకు ముందు కూడా సందీప్ కిషన్...డికే బోసు చిత్రం సైతం గ్రౌండ్ హగ్ డే చిత్రం ప్రేరణతో తయారయినట్లు వార్తలు వచ్చాయి. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీకే సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత.

సందీప్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నా సినిమాలో ఒకరో, ఇద్దరో పెద్ద నటులు కనిపించేవారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లోనూ పెద్ద నటీనటులున్నారు. నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబుగారితో నటించడం ఆనందంగా ఉంది. మంచి లవ్ ఎంటర్‌టైనర్. అచ్చు మంచి సంగీతాన్నిచ్చారు'' అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ "మా సంస్థలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో ఆడియో, వచ్చే నెల్లో సినిమాను విడుదల చేస్తాం. సందీప్ సోదరుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది'' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ "జగపతిబాబు రోల్ సినిమాకు హైలైట్ అవుతుంది. మా నిర్మాత కథను నమ్మి అవకాశమిచ్చారు'' అని తెలిపారు. మంచి టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని రెజీనా, కాశీ విశ్వనాథ్, గణేష్ అన్నారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శ్రీరామ్, ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు.


Click it and Unblock the Notifications











