Raaka: ‘రాకా' కోసం అట్లీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. వామ్మో ఇన్ని కోట్లా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా 'రాకా'(Raaka). ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సినిమా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆ ఆసక్తి మరింత రెట్టింపు అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత వస్తున్న మూవీ కావడం, మరోవైపు 'జవాన్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అట్లీ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల సినీ వర్గాల్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకా కోసం డైరెక్టర్ అట్లీ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

రాకా సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ ఫిక్చర్స్ (Sun Pictures)బ్యానర్‌పై కళానిథి మారన్ (Kalanithi Maran)నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.800 నుంచి రూ.900 కోట్ల మధ్య ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సగం బడ్జెట్ కేవలం నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే వెళ్తోందన్న వార్త ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.

Raaka Atlee Shocking Remuneration Revealed for Allu Arjun s Mega Pan India Film Buzz

ఈ ప్రాజెక్ట్ కోసం హీరో అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. సమాచారం ప్రకారం బన్నీకి ఈ సినిమాకు రూ.175 నుంచి రూ.180 కోట్ల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అంతేకాదు, సినిమా లాభాల్లో 15 శాతం వాటా కూడా ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సినిమా భారీ విజయం సాధిస్తే, ఈ ఒక్క సినిమాతో ఆయన మొత్తం ఆదాయం రూ.300 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హీరో అందుకునే అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలవొచ్చు.

ఇక దర్శకుడు అట్లీ కూడా ఈ సినిమాతో తన రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 'జవాన్' భారీ విజయంతో ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పరచుకున్న అట్లీ, ఇప్పుడు 'రాకా' కోసం రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. కేవలం హీరో, దర్శకుడు ఇద్దరికే కలిపి దాదాపు రూ.275 కోట్లకు పైగా వెళ్తోందన్న టాక్ నిర్మాతల నమ్మకాన్ని తెలియజేస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపిక పడుకొణె నటిస్తున్నట్లు సమాచారం. ఆమెకు సుమారు రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్య పారితోషికం ఇవ్వనున్నారట. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు రూ.5 నుంచి రూ.7 కోట్ల మధ్య రెమ్యునరేషన్ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే జాన్వీ కపూర్, మ్రణాల్ ఠాకుర్ వంటి స్టార్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్లకు కూడా కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్టు టాక్.

'రాకా' కథ విషయానికి వస్తే, ఇది సాధారణ మాస్ యాక్షన్ సినిమా కాదని టాక్. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో అట్లీ ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నారట. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. తండ్రి, ఇద్దరు కుమారులుగా మూడు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారట. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి సగం మనిషి - సగం రాక్షసుడి తరహా లుక్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే కారణంగా బన్నీ మేకప్‌కే ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు వేయడానికి, మరో రెండు గంటలు తీసివేయడానికి పడుతోందట. అంటే రోజుకు ఆరు గంటలు కేవలం మేకప్‌కే వెళ్తుండటంతో, షూటింగ్ సౌకర్యార్థం ఆయన ముంబైకి షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా భారీ ప్రాధాన్యత ఇస్తున్నారట. అందుకే సినిమా విడుదలను తొందరపెట్టకుండా, పూర్తి క్వాలిటీతో వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా 'రాకా' కేవలం మరో సినిమా కాదు.. ఇండియన్ సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్, విజువల్ స్కేల్ లెక్కలన్నింటినీ మార్చే ప్రాజెక్ట్‌గా మారబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. బన్నీ - అట్లీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Read more about: allu arjun atlee Raaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X