Raaka OTT: పుష్ప 2 రికార్డును టార్గెట్ చేసిన ‘రాకా'.. ఓటీటీ డీల్ అన్ని కోట్లా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ స్టార్‌లలో ఒకరు. 'పుష్ప' సిరీస్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించారు బన్నీ. 'పుష్ప-2'తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా వసూళ్లు మాత్రమే కాదు, డిజిటల్ రైట్స్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయమే. ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. 'పుష్ప-2' ఓటీటీ హక్కులు సుమారు రూ. 270 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బన్నీ తదుపరి సినిమా 'రాకా'పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్‌, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబో వస్తున్న సినిమా రాకా. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన నాటి నుంచి మూవీ లవర్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కేవలం సౌత్ లేదా నార్త్ మార్కెట్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా అట్లీ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రాకా ( Raaka Movie) సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇందుకోసం దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.

Raaka OTT Deal Can Allu Arjun and Atlee s Film Surpass Pushpa 2 Digital Rights Record

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'రాకా'లో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించున్నారట. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా అల్లు అర్జున్ ని అట్లీ చూపించనున్నారట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గుండు, గాయాలు, తోడేలు చేయి వంటి ఎలిమెంట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. దీంతో సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమా ఓటీటీ హక్కుల గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం రూ.300 కోట్లకు పైగా ఆశిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఉంది. ఓటీటీ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. స్టార్ పవర్‌తో పాటు కథ, పాన్ ఇండియా రీచ్, భాషల వారీగా ప్రేక్షకాదరణ, థియేట్రికల్ బిజినెస్ అవకాశాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇక 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడం, అట్లీ-బన్నీ కాంబినేషన్ మొదటిసారి కలిసి పనిచేయడం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ప్లాన్ చేయడం వంటి అంశాలు 'రాకా'ను ఇండియన్ సినిమా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నిలబెట్టాయి. మరి నిర్మాతలు ఆశిస్తున్నట్లు రూ.300 కోట్లకు పైగా ఓటీటీ డీల్ కుదురుతుందా? లేక మార్కెట్ పరిస్థితులు ఆ అంచనాలకు బ్రేకులు వేస్తాయా? అనేది రానున్న నెలల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం 'రాకా' డిజిటల్ హక్కుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: allu arjun Raaka pushpa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X