Raaka: అల్లు అర్జున్ సినిమా కోసం రష్మిక కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

Raaka: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప', 'పుష్ప 2'భారీ విజయాల తర్వాత ఇప్పుడు మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాకా (Raaka) అనే టైటిల్‌తో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక కూడా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కెమిస్ట్రీ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ రష్మిక మందన్నా (Rashmika Mandanna)స్పెషల్ పాత్రలో నటించబోతుందట. అందుకోసం రష్మిక కళ్లుచెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంతకీ ఎన్ని కోట్లంటే?

అల్లు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాకా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్‌లో బన్నీ సగం మనిషి - సగం మృగం లుక్‌లో కనిపించడం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ లుక్ ద్వారా సినిమా కథ చాలా ఇన్‌టెన్స్‌గా, డార్క్ థీమ్‌తో ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ లేదా ట్రిపుల్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది. ఒక పాత్ర పూర్తిగా నెగటివ్ షేడ్స్‌తో ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.

Raaka Rashmika Mandanna record Remuneration for Allu Arjun Pan-India Film Revealed

అంతేకాదు, 'రాకా' కథ పునర్జన్మలు, ప్యారలల్ యూనివర్స్‌లు, మిథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ అంశాల మిశ్రమంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్‌తో అట్లీ ఇండియన్ సినిమాకు కొత్త దిశ చూపించబోతున్నాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రముఖ VFX టీమ్స్ పనిచేస్తుండటంతో, ఈ సినిమా విజువల్‌గా ఇండియన్ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయనుందని టాక్.

యాక్షన్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం కూడా మరో ప్రధాన ఆకర్షణగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోణె ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె పాత్రకు యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండనున్నాయని, కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల్లో ఆమె కనిపించబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటివరకు గ్లామర్, లవ్ స్టోరీ పాత్రలతో అలరించిన రష్మిక... ఈసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం రావడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో 15 శాతం వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆయన మొత్తం ఆదాయం దాదాపు రూ.300 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ క్రమంలో రష్మిక మందన్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో కీలకమైన నెగటివ్ పాత్ర కోసం ఆమెకు రూ.5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌లోనే భారీ రెమ్యూనరేషన్లలో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక నెగటివ్ రోల్ కోసం ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ఆమె పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. విడుదలకు ముందే భారీ అంచనాలు చూస్తే... ఇది భారతీయ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందనే మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X