RAAKA: పుష్ప 2 సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న రాకా.. బన్నీ-అట్లీ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రాకా (RAAKA). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప, పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'రాకా'విడుదల తేదీకి సంబంధించి వస్తున్న రూమర్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మ్యాటరేంటీ?

పుష్ప 2 ఫార్ములానే ఫాలో అవుతున్నారా?
ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాకా సినిమాను మొదట 2027 తొలి త్రైమాసికంలో విడుదల చేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్ కూడా ప్లాన్ వేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు డిసెంబర్ 2027కి వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'పుష్ప: ది రైజ్'కూడా డిసెంబర్ నెలలోనే విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

RAAKA Release Strategy Is Allu Arjun Following Pushpa 2 Formula for a Bigger Box Office Blast

ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను రాకా కోసం కూడా ఫాలో అవుతున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఎందుకంటే.. డిసెంబర్ సీజన్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాకా మూవీ మేకర్స్ ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిత సమయాల్లో కంటే.. ఈ సీజన్ బెటర్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఇతర సినిమాలతో పోటీ కూడా తగ్గేనని చెప్పాలి. గతంలో పుష్ప 2 సినిమా ఇదే సీజన్ లో విడుదలై ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'రాకా' సాధారణ కమర్షియల్ సినిమా కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. పునర్జన్మలు, సమాంతర ప్రపంచాలు (Parallel Worlds), ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్, హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడా సినిమాగా రూపొందుతోందని టాక్. ఇలాంటి కథను తెరపై అత్యున్నత స్థాయిలో ఆవిష్కరించాలంటే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ కోసం అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అట్లీ, సన్ పిక్చర్స్ నిర్ణయించుకున్నారట. అందుకే షూటింగ్ పూర్తైన తర్వాత కూడా దాదాపు ఏడాది వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

'రాకా' భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ల్లో ఒకటిగా నిలవబోతోందని ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోందని సమాచారం. ఈ స్థాయి బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే కేవలం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సినిమా భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అందుకే కథ, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికర విషయమేమిటంటే? 'రాకా'లో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా బన్నీని అట్లీ ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గుండు, గాయాలు, తోడేలు చేయి వంటి ఎలిమెంట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. దీంతో సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పేర్లపై చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.

'జవాన్'తో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అట్లీ.. ఇప్పుడు 'రాకా'తో తన కెరీర్‌లోనే అతిపెద్ద సవాల్‌ను స్వీకరించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను భారీ విజువల్స్‌తో మిళితం చేయడంలో అట్లీకి మంచి పేరుంది. ఇప్పుడు అదే ఫార్ములాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఏదిఏమైనా ప్రస్తుతం 'రాకా'విడుదల తేదీపై వస్తున్న వార్తలు అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే డిసెంబర్ 2, 2027 తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. 'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ కెరీర్‌లో మరో భారీ ఈవెంట్ మూవీగా 'రాకా' నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X