రాకాసకు సంగీత్ శోభన్‌కు క్రేజీ రెమ్యునరేషన్.. నిహారిక కొణిదెల మూవీకి ఎన్ని కోట్లంటే?

మ్యాడ్ సినిమాతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంగీత్ శోభన్. కామెడీ, లవ్, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లతో దూసుకొస్తున్నాడు ఈ కుర్రాడు. ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇతను కొన్నేళ్లపాటు తన హవా సాగిస్తాడని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాకాస మూవీలో సంగీత్ శోభన్ నటించారు. ఈ సినిమా కోసం ఇతనికి భారీ రెమ్యునరేషన్ అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

రెబల్‌స్టార్ ప్రభాస్‌తో వర్షం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శోభన్ రెండో కుమారుడు సంగీత్ శోభన్. ఇతనికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే శోభన్ కన్నుమూశారు. దాంతో చిన్న వయసులోనే కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. తన ప్రతిభతో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు. వెబ్ సిరీస్‌లు చేస్తూ.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్‌కు మ్యాడ్‌లో ఛాన్స్ దక్కింది. మ్యాడ్ సినిమాకు బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డ్స్ అందుకున్నారు సంగీత్. మ్యాడ్‌లో ముగ్గురు కుర్రాళ్లు హీరోలుగా నటించారు. అయితే సంగీత్‌కే ఎక్కువ గుర్తింపు, పేరు దక్కింది. డైలాగ్ డెలివరీ, కామెడీ పంచ్‌లు, నటన విషయంలో మిగిలిన ఇద్దరిని సంగీత్ దాటేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సోలో హీరోగా ఆఫర్లు వస్తున్నాయి.

Raakasa Sangeeth Shobhan get huge Remuneration for Niharika Konidela s Movie

నిర్మాతగా మారి యంగ్ టాలెంట్‌ను ప్రొత్సహిస్తున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల దృష్టి సంగీత్‌పై పడింది. కమిటీ కుర్రోళ్లు హిట్ తర్వాత తన రెండో సినిమా ఎవరితో తీయాలా అని చూస్తుండగా.. ఈ సినిమాకు సంగీత్‌ను హీరోగా ఎంచుకున్నారు నిహారిక. అంతకుముందే సంగీత్‌కు తన వెబ్ సిరీస్‌లో అవకాశం ఇచ్చారు మెగా డాటర్. జీ5తో కలిసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ కీలక పాత్రలో నటించారు. అప్పుడు వెబ్ సిరీస్‌లో ఛాన్స్ ఇచ్చిన నిహారిక ఈ సారి ఫిచర్ ఫిల్మ్‌లో సంగీత్‌ని సోలో హీరోగా చేశారు.

తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో రాకాస సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాపై బజ్ ఎక్కడ తగ్గకుండా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు నిహారిక. ఇప్పటికే ఈవెంట్స్, పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఇక రాకాస సినిమా కోసం సంగీత్ శోభన్ పారితోషికం ఎంత? అంటూ డిస్కషన్స్ నడుస్తోంది. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంగీత్‌కు 2.7 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కింద నిహారిక చెల్లించినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాకాస కనుక బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తే.. తన తదుపరి సినిమాకు పారితోషికాన్ని 3 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేయాలని సంగీత్ భావిస్తున్నారట. ప్రమోషనల్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం, నిర్మాతలకు తగినట్లుగా నడుచుకోవడం సంగీత్‌కు ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఈ కుర్రాడు ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X