ప్రభాస్ భారీ సినిమాలో రాశీ ఖన్నా: ఊహించని పాత్రలో నటించనున్న ముద్దుగుమ్మ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అతడు ఇప్పటికే 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేయగా.. మరో రెండు చిత్రాలను ఏక కాలంలో చేస్తున్నాడు. ఇవి కాక.. అతడు చేయాల్సిన మరో చిత్రం కూడా ఉంది. అదే 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించే బిగ్ బడ్జెట్ ప్రాజెక్టు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఉన్న ఎంతో మంది నటీనటులు భాగంగ కాబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను.. సైంటిస్ట్ పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎంతో ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నాను తీసుకుంటున్నారట. ఆమె చేసే పాత్ర కాసేపే కనిపించినా.. ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక, ఈ సినిమాలో రాశీ ఖన్నా పోషించబోతున్న పాత్ర ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేశాడట నాగ్ అశ్విన్. అందుకే అడిగిన వెంటనే ఈ అమ్మడు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతున్నారట. ఎంతో భారీగా రూపొందనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. టైం మెషీన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రం ఏకంగా 15 భాషల్లో తెరకెక్కనుందని ఇటీవలే ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











