For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లు అర్జున్‌తో రాశి ఖన్నా రొమాన్స్.. కన్ఫర్మ్ అయినట్లే

|

అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' ఆశించిన మేర ఫలితం రాబట్టకపోవడంతో ఈ ఏడాది భారీ హిట్ దిశగా అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు అల్లు అర్జున్. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చేయగా వేణు శ్రీరామ్ మూవీ మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

స్క్రిప్ట్ ఆధారంగా ఈ చిత్రంలో బన్నీ సరసన రాశి ఖన్నాను హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని భావించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అయితే బన్నీతో ఛాన్స్ అనగానే రాశి ఖన్నా వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం. ఐకాన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ లుక్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8 వ తేదీన విడుదల చేశారు. డిఫెరెంట్ టైటిల్ కావడంతో మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఐకాన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

Raashi Khanna Will Romance with Allu Arjun

ఇటీవలే 'తొలిప్రేమ', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న 'వెంకీ మామ' సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో మరో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. ఇప్పుడు బన్నీ సినిమాలో కూడా అవకాశం రావడం చూస్తే ఇక ఆమె ఆమె స్టార్ హీరోయిన్ క్రేజ్ కొట్టేసినట్లే అని తెలుస్తోంది. అతిత్వరలోనే ఐకాన్ సినిమా మరోవైపు త్రివిక్రమ్ సెట్స్ పై చురుకుగా కదులుతున్న అల్లు అర్జున్.. ఈ సినిమాలో పూజా హెగ్డేతో చిందులేస్తున్నాడు.

English summary
Stylish Star Allu Arjun has already joined the sets of his upcoming movie with director Trivikram Srinivas, which is shooting successfully. Recently, the team did a customary pooja in Hyderabad. He has also announced his next flick titled ICON.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more