Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసిన రావణ్..? ఉబ్బితబ్బివుతున్న వర్మ
'రావణ్" డిజాస్టర్ అవడంతో దీనిని 'మణిరత్నం కీ ఆగ్" అని పిలుస్తున్న నేపథ్యంలో ఏ దిక్కుమాలిన సినిమా వచ్చినా కానీ దానికి తన సినిమాతో పోలిక పెడుతున్నారని పొంగిపోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. నిజానికి 'షోలే" కంటే ఇప్పుడు తన సినిమానే పాపులర్ అని కూడా సెలవిచ్చాడు. హిందీ చిత్రరంగం వరకు వర్మ తీసిన 'ఆగ్" ప్లాప్ సినిమాలకి బెంచ్ మార్క్ గా నిలిచిపోయినట్టే మన తెలుగు చిత్ర రంగంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన 'జానీ" అలా తిరుగులేని ప్లాప్ గా చరిత్రలో నిలిచిపోయింది. 'జానీ"కి ముందు, తర్వాత ఎన్నెన్నో పరమ చెత్త సినిమాలొచ్చాయి గానీ భారీ చిత్రమేది డిజాస్టర్ అయినా కూడా దాని పరాజయం స్థాయి చెప్పడానికి 'ఇంకో జానీ" అంటుంటారు.
జానీ తర్వాత భయంకరమైన ప్లాప్ సినిమాలు, ఇంకా చెప్పాలంటే 'జానీ" కంటే భారీ ప్లాపులు చాలా వచ్చాయి. జూ ఎన్టీఆర్ కి 'ఆంధ్రవాలా", 'నా అల్లుడు"..మహేష్ కి 'నాని", 'సైనికుడు"..బాలకృష్ణకి అయితే డిజాస్టర్స్ టు ది పవరాఫ్ ఇన్ ఫినిటి ..ఎన్ని వున్నా కానీ అభిమానులని, బిజినెస్ వర్గాలని దారుణంగా నిరుత్సాహపరిచిన సినిమాగా 'జానీ"ని కొట్టే సినిమా ఇంతదాకా రాలేదనే అనాలి. తమిళ చిత్ర పరిశ్రమ వరకు రజనీకాంత్ నటించిన 'బాబా" బెంచ్ మార్క్ డిజాస్టర్ గా రికార్డ్ సృష్టించింది.