డైరక్టర్ హెల్త్ ప్లాబ్లంతోనే ఎన్టీఆర్ ఆ నిర్ణయం?
హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస ' (వర్కింగ్ టైటిల్) దర్శకుడు అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముందు అనుకున్న షెడ్యూల్ ని ఎన్టీఆర్ ఛేంజ్ చేసారు. ఈ చిత్రంలో పాటలను కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకుని చిత్రంలో నాలుగవ సాంగ్ షూటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సాంగ్స్ పూర్తి అయ్యాక దర్శకుడు రెగ్యులర్ షూటింగ్ కి హాజరై బ్యాలన్స్ ఉన్న మిగతా సీన్స్ ఫినిష్ చేయనున్నాడని సమాచారం. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో పాట షూటింగ్ ఈ రోజు నుంచి ప్లాన్ చేసారు.
ఇక రీసెంట్ గా ఎన్టీఆర్,సమంత,ప్రణతి,మిగతా గ్యాంగ్ మీదుగా మాంటేజ్ షాట్స్ చిత్రీకరించారు. అలాగే పొల్లాచిలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ఫినిష్ చేసారు. గంధర్వ మహల్ లో ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరించారు. చిత్రతంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఎన్టీఆర్,సమంత,ప్రణితి మీద ఓ సాంగ్ త్వరలో షూట్ చేస్తారు. ఏప్రియల్ మొదటి వారంలో ఫారిన్ లొకేషన్స్ లో ఓ మెలోడీని చిత్రీకరిస్తారు.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.
నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












