పంచ్ పడుద్దంటూ ఎన్టీఆర్ హెచ్చరిక??
హైదరాబాద్: పైకి నవ్విస్తూ, హీరోయిన్ ని ఆట పట్టిస్తూంటాడు హీరో...అయితే ఆ తర్వాత అతను విలన్స్ ని కొట్టిన దెబ్బలోని పవర్ ని చూసాక, అతను ఎంత రగిలిపోతోంది, అతనికి ఏం అన్యాయం జరిగింది అనేది ప్రేక్షకుడుకి అర్దమవుతుంది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ నిజ జీవితంలో అదే స్క్రీన్ ప్లేని ఫాలో అవుతున్నాడంటున్నారు. లోపల రగిలిపోతున్నా..పైకి చాలా సౌమ్యంగా తన షూటింగ్ తాను చేసుకుపోతున్నాడని, తన విజయం ద్వారా, తనను ప్రక్కన పెట్టిన వారికి పవర్ పంచ్ ఇవ్వాలని భావిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆయన మౌనం చూసేవారికి పంచ్ పడద్ది అనే హెచ్చరిక చేస్తున్నట్లు ఉందంటున్నారు.
జూ ఎన్టీఆర్ ...తెలుగు దేశం ప్రచారంలోకి వస్తాడని అంతా భావించారు. అయితే ఆయన మాత్రం అసలు ఎలక్షన్స్ ని కేవలం పౌరుడుగా ఓటేయటం వరకే పట్టించుకున్నారు. ఆయన ప్రచారంలోకి రాకపోవటానికి కారణంగా...చంద్రబాబు నాయుడు స్వయంగా పిలవలేదని, తన తండ్రిని నిరాదరించారని ఇలా రకరకాల కారణాలు వినపడుతున్నా ఎక్కడా నోరు మొదపకుండా సైలంగా ఉండిపోయారు. ఈ విషయాలపై మీడియా ముందుకు వస్తారని అనుకున్నారు. అదీ చేయలేదు. పూర్తిగా తన దృష్టిని కెరీర్ పైనే పెట్టి ఎటువంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా శభాష్ అనిపించుకున్నారు. సూపర్ హిట్ ఇవ్వటం ద్వారా తానేంటో అందరికీ తెలియచేయాలనే కృత నిర్చయింతో ఉన్నారంటున్నారు.

సినిమావారంతా ఎలక్షన్ హడావిడిలో మునిగితేలుతుంటూ జూ ఎన్టీఆర్ మాత్రం కూల్ గా తన షూటింగ్ చేసుకుపోతున్నాడు. ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలనే ఏకైక లక్ష్యంతో తన తాజా చిత్రం రభసపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ మేరకు రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో వినోదాలు, పోరాటాలు, కుటుంబ అనుబంధాలు... ఇలా అన్నింటికీ ప్రాధాన్యముంటుంది. అవే లెక్కలతో ప్రస్తుతం ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా చివరి దశకు చేరుకొంటుంది.
నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్ నుంచి ఏమేం ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయి. అటు అభిమానులతో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకుల్నీ అలరించేలా ఉంటుందీ చిత్రం. ఎన్టీఆర్ చేసే రభస మరింత కొత్తగా ఉంటుంది. ఆయన రెండు రకాల పాత్రల్లో పంచే వినోదాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి''అని అన్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











