twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ కోసమే ఎన్టీఆర్ వెనక్కి...

    By Srikanya
    |

    'Rabhasa' releases on May 9?
    హైదరాబాద్ : తన బాబాయ్ బాలకృష్ణ సినిమా రిలీజ్ కోసమే ఎన్టీఆర్ తాజా చిత్రం రిలీజ్ ని వెనక్కి నెట్టారని తెలుస్తోంది. ఇద్దరి నందమూరి హీరోలు సినిమాల మధ్య గ్యాప్ ఉండకపోతే భాక్సాఫీస్ వద్ద ఇబ్బంది ఎదురౌతుందనే ఆలోచనతోనే ఇలా చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మొదట రభసను మార్చి28న విడుదల చేయాలని అనుకున్నారు. అదే సమయంలో బాలకృష్ణ,బోయపాటి చిత్రం లెజండ్ వస్తోంది. దాంతో తమ చిత్రాన్ని మే 9 కి ఫోస్ట్ ఫోన్ చేసారు.

    దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

    ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    
 Rabhasa makers had decided to release the film on March 28th, but then they changed minds. Reason for this was that Balakrishna’s Legend will be releasing during the same time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X