‘రభస’మీద రభస జరుగుతోంది

By Srikanya

హైదరాబాద్ : జూ. ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమా మళ్లీ వాయిదా పడనుందా అవుననే అంటున్నారు టాలీవుడ్ జనం. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల చేస్దామని అన్నారు. కానీ ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తున్నదాన్ని బట్టి వచ్చే నెలకు వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది. ఓ ప్రక్క ఈ చిత్రం ప్రమోషన్ కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఫైనాన్సియల్ ఇష్యూలే వాయిదాకి కారణమని చెప్పుకుంటున్నారు.

ఆడియో రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా ప్రమోషన్ ని పెంచుతారు. కాని బెల్లంకొండ సురేష్ తన కుమారుడు నటించిన అల్లుడు శీను చిత్రం గురించే ఎంతసేపూ మీడియాలో నలుగుతోంది, అలాగే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చిన విషయం గురించి చెప్పుకుంటున్నారు కాని రభస గురించి ఎక్కడా ఊసే లేదు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Rabhasa set for another Post-ponement

దర్శకుడు మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నుంచి రాబోతున్న మరో వినోదాత్మక యాక్షన్‌ తరహా చిత్రమిది. హీరో పాత్ర చిత్రణ, కథ నడవడిక వైవిధ్యంగా ఉంటాయి'' అన్నారు. అలాగే హీరోగా ప్రేక్షకుల మన్ననలను పొందిన ఎన్టీఆర్‌ ఇప్పుడు డ్యాన్స్‌ మాస్టర్‌ అవుతున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఇప్పుడు ఇదే టాక్‌. 'రభస' సినిమా ఇంట్రడక్షన్‌ పాట కోసం ఎన్టీఆర్‌ నృత్య రీతులు సమకూర్చారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X