‘రేసు గుర్రం’ లో అల్లు అర్జున్ పాత్ర ఏంటి

ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
నల్లమలుపు శ్రీనివాస్, డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు వ్యవహారంలో ఉంది కానీ అధికారికంగా ప్రకటించలేదు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మీడియా కన్నును కప్పి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తర్వాత షెడ్యూల్‌కు నార్వే కు వెళ్లారు.
బన్నీ, శృతిహాసన్‌లపై రెండు పాటలను, మరికొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం నిర్మించనున్నారని సమాచారం. బన్నీ ఈ చిత్రంలో సరికొత్త స్టయిల్లో కనిపించనున్నారని, అతని గెటప్ అంతా మార్చివేసి నిర్మిస్తున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











