'రేసుగుర్రం' ట్రైలర్ కన్ఫూజన్
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'రేసుగుర్రం' పాటల విడుదల వేడుక జరిగింది. అక్కడ ట్రైలర్ ని చూపెట్టారు. కానీ తర్వాత టీవీల్లో కానీ, మరెక్కడాకానీ ఆ ట్రైలర్ కనపడలేదు. ఫ్యాన్స్ యూ ట్యూబ్ లో వెతికారు. కానీ అది ఎక్కడా కనపడలేదు. దానికి కారణం ఎంక్వైరీ చేస్తే అసలు ట్రైలర్ ని విడుదల చేయలేదని తెలిసింది. ఎందుకంటే ఇంకా ట్రైలర్ ఎడిటింగ్ పూర్తి కాలేదని తెలుస్తోంది. మార్చి 18న అఫీషియల్ గా ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. అప్పటికీ ఫ్యాన్స్ సాంగ్స్ ట్రైలర్స్ ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఈ చిత్రానికి తమన్ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.... ''నా జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా ఇది. సురేందర్ రెడ్డి చాలా బాగా తీశారు. పరిశ్రమలో ప్రతి దర్శకుడు సినిమాతోపాటు నా హీరో బాగుండాలని కోరుకుంటాడు. వాళ్ల అభిరుచి వల్లే మేము తెరపై ఇంత అందంగా కనిపిస్తుంటాం. 'కిక్', 'బృందావనం' పాటలు విన్నాక తమన్‌తో పని చేయాలనిపించింది. ప్రపంచ స్థాయి సంగీతం తన దగ్గర ఉంటుంది.'' అన్నారు.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... ''తెరపై బన్నీ రేసుగుర్రమైతే తెరవెనుక చిత్రబృందమంతా రేసుగుర్రాల్లా పరుగెత్తి పని చేశారు. తమన్ తన పాటలతో నాకు రెండింతలు కిక్ ఇచ్చాడు. ఈ సినిమా విజయం ఎప్పుడో ఖరారైంది. ప్రజల చప్పట్ల కోసమే ఎదురు చూస్తున్నా'' అన్నారు.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











