'రెబల్'కి రామ్ చరణ్ 'రచ్చ'సెంటిమెంట్?
ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'కి దర్శకుడు 'రచ్చ'సెంటిమెంట్ అద్దే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. రామ్ చరణ్ 'రచ్చ'బేంబూ ఫైట్ షూటింగ్ జరిగిన ప్రదేశంలో 'రెబల్'షూటింగ్ చేస్తున్నడాని వినికిడి. చైనాలో ఆ ప్రాంతానికి వెళ్లి మరీ సెంటిమెంట్ గా సీన్స్ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అలాగే రచ్చ లోని వాన..వాన పాటని చూసి అలాంటి పాటనే రెబెల్ లో చిత్రీకరించాడు. ఇలా చేయటంతో 'రచ్చ'లాగే 'రెబల్'హిట్టవుతుందని భావించి చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
చిత్రం గురించి దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు.
అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్‌గా ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా తిరగబడ్డ ఆ పోరు బిడ్డ ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి? తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం అన్నారు.
ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. హీరో,హీరోయిన్స్ పాల్గొంటున్న కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని అన్నారు నిర్మాతలు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం రూ.2 కోట్ల వ్యయమైంది. ప్రత్యేకంగా కాళీమాత విగ్రహాన్ని తయారుచేయించాం. మూడు పాటల్లో రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. స్వరాల బాధ్యతను కూడా లారెన్స్ తీసుకొన్నారు.
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











