రామ్ చరణ్ ‘రచ్చ’ ఆడియో మళ్లీ వాయిదా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొదుతున్న 'రచ్చ' ఆడియో మార్చి 4న కర్నూలులో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆడియో వేడుకను మార్చి 9కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏర్పాట్లు పూర్తి కాక పోవడం వల్లనే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై 'రచ్చ' చిత్రాన్ని రూపొందిస్తుననారు. మణిశర్మ సంగీతం సంగీతం అందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రచ్చ చిత్రాన్ని మార్చి చివరి వారంలో గాని ఏప్పిల్ నెలలోగానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని చేస్తున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం ఖర్చు రూ. 29 కోట్లకు చేరువైనట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఉందని, యాక్షన్ సన్ని వేశాల చిత్రీకరణకు రూ. 2 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











