రామ్ చరణ్ ముందుకు.. ఎన్టీఆర్ వెనక్కి?
ఇప్పుడు టాలీవుడ్ లో అందరి దృష్టీ రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ, ఎన్టీఆర్ చిత్రం దమ్ము పైనే ఉందనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు ముందుగా అనుకున్న టైమ్ కు దియోటర్స్ కు వచ్చేటట్లు కనపడటం లేదు. రచ్చ చిత్రం రిలీజ్ డేట్ ను ముందనుకున్నట్లుగా మే లో కాకుండా ముందుకు తీసుకువస్తున్నారు. అలాగే దమ్ము చిత్రం విడుదల తేదీని మొదట ఏప్రియల్ 5 న అనుకున్నారు. అయితే అదీ రెండు వారాలు వెనక్కి వెళ్లబోతోందని సమాచారం.
ఇక రచ్చ ఆడియోని పిబ్రవరి 20 న డేట్ ఫిక్స్ చేసారు. అలాగే మార్చి 22 న సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారు. దానికి కారణం 23 న ఉగాది,24,25 తేదీలు వీకెండ్ లు కావటంతో వరసగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక దమ్ము చిత్రాన్ని ఏప్రియల్ మూడవ వారంలో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాలు మార్కెట్లో మంచి క్రేజ్ తో బిజినెస్ చేస్తున్నాయి. రచ్చ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. అలాగే దమ్ము చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు మాస్ ఎంటర్టైనర్సే కావటం గమనార్హం.


Click it and Unblock the Notifications











