'రచ్చ' ఆ చిత్రానికి కాపీ అంటూ ప్రచారం
ఇప్పుడు తెలుగులో రిలీజ్ కు రెడీ అవతూ హాట్ గా ఉన్న సినిమా ఏమిటీ అంటే రచ్చ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దాంతో ఈ చిత్రంపై రోజుకో రూమర్ చొప్పున ప్రచారంలోకి వస్తోంది. తాజాగా ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన బన్ని కథకు కాపీ అంటూ రూమర్ నెట్ లో స్ప్రెడ్ కావటం మొదలైంది. వారు చెప్పేదాని ప్రకారం బన్నీలోలాగానే రామ్ చరణ్ తండ్రి(పార్ధీపన్) పాత్ర ప్లాష్ బ్లాక్ లో వస్తాడు. అలాగే బన్నీ తరహాలోనే సోషల్ కాజ్ కోసం పోరాడుతాడు. బన్నీలో పోలవరం ప్రాజెక్టు కోసం పోరాడితే..ఇక్కడ తెలంగాణాలోని ప్లోరైడ్ వాటర్ సమస్యలపై పోరాడతాడు. అలా చాలా పోలికలు చెప్తున్నారు. అయితే రామ్ చరణ్ రచ్చ కథ లీకైంది..ఫలానా అని చెప్పుకోవటమే కానీ అఫీషియల్ గా కథ ఎవరికీ తెలియదు కాబట్టి దీనిపై ఎవ్వరూ స్పందించటం లేదు.
ఇక పెద్ద సినిమా విడుదల అయ్యేటప్పుడు ఇలాంటి రూమర్స్ కామన్ అని సీనియర్స్ అంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ విశ్వం అనే పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర మెడికో అని చెప్తున్నారు. అలాగే రామ్ చరణ్ పాత్రకు పందాలు కాసి గెలవటం అలవాటు ఉంటుంది. అదే కథలో కీలకంగా ఉండబోతోందని అంటున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించానని దర్సకుడు హామీ ఇస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు అంతటా సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











