రామ్ చరణ్ 'రచ్చ' రిలీజ్ డేట్ సీక్రెట్
రామ్ చరణ్ తాజా చిత్రం పిబ్రవరి ఇరవైన విడుదల చేయనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కాదనుకుని ఎందుకని పిబ్రవరిలో ఆ డేట్ ఫిక్స్ చేసారని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే దానికి కారణం ఆ రోజు మహాశివరాత్రి అని అందుకే ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకునే విడుదలను ప్లాన్ చేసారని తెలుస్తోంది. నిజానికి పిభ్రవరి 17న వీకెండ్ వచ్చినా మహాశివరాత్రి వచ్చేది పిబ్రవరి ఇరవైన కాబట్టి ఆ రోజున ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ సూపర్ గుడ్ బ్యానర్ పై రూపొందిన చిత్రాలను పండగ సీజన్ లో అవకాశం ఉంటే శివరాత్రికి విడుదల చేసి విజయం సాధించేవారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అందుకే రచ్చను మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసి కలెక్షన్స్ రచ్చ రచ్చ చేయాలని నిర్ణయించారని సమాచారం.
అంతేగాక సంక్రాంతి సినిమాల మధ్యలో వేస్తే కలెక్షన్స్ పంచుకోవాల్సి వస్తుందని, దానికన్నా పిబ్రవరిలో ఎక్కువ సినిమాలు విడుదల పెట్టుకోరు కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రవితేజ నిప్పు, బాలకృష్ణ అధినాయకుడు, వెంకటేష్ బాడీగార్డ్, మహేష్ ది బిజెనెస్ మ్యాన్ వంటి చిత్రాలు క్యూ కట్టాయి. దాంతో వీరి మధ్యలో పోటికి వెళ్లేకన్నా కూల్ వచ్చి కలెక్షవ్స్ కొల్లగొట్టడం బెస్ట్ అనే నిర్ణయానికి రామ్ చరణ్ వచ్చినట్లు చెప్తున్నారు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ 'రచ్చ' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











