హాట్ టాపిక్: 'రచ్చ' లీకైన టైటిల్ సాంగ్ లిరిక్స్

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ' టైటిల్ సాంగ్ లీక్ అయ్యి నెట్ లో సంచలనం క్రియేట్ చేసింది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. ఈ సాంగ్ ఇలా సాగుతుంది..."సైలెంట్ చూపులోడు...వైలెంట్ చేతలోడు ...కరెంట్ కండలోడు..హీ ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ ...రచ్చ...అడుగేస్తే సీడెడ్..ఆంధ్రా..నైజాం..రచ్చ...వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ..హీఈజ్ గోయింగ్ టుబి ఎ మెగాస్టార్...హీఈజ్ గోయింగ్ టు బి ఎ గెగా స్టార్.. హీ ఈజ్ గోయింగ్ టు బి ఎ యుగా స్టార్..అంటూ మాస్ బీట్ తో ఈ సాంగ్" సాగుతుంది. ఈ సాంగ్ లో...బాలీవుడ్ లో'రాస్కెల్స్‌','ఆయేషా'చిత్రాలలో హీరోయిన్ గా చేసిన లీసా హైడెన్‌ రామ్ చరణ్ తో డాన్స్ చేస్తుంది.ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆ పాటను చిత్రీకరించారు.

ఇటీవలే హైదరాబాద్‌లో ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చగా ఆ గీతాన్ని తెరకెక్కించారు. ఇక రచ్చ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా అందించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X