రెట్రో సెట్స్‌పై ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

బాహుబలి, సాహో లాంటి భారీ సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా జాన్( వర్కింగ్ టైటిల్). ఈ సినిమా కోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇటీవలే వచ్చిన తన 'సాహో' మూవీ ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో ఈ సినిమాతో ఆ లోటు పూడ్చుకోవాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు.

'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాహోతో పాటే కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మ‌ధ్యలో విడుద‌ల‌ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు న‌వంబ‌ర్ 19 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

 Radha Krishna Kumar- Prabhas shooting update

ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెట్రో సెట్‌ను సిద్ధం చేశాడ‌ట‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లోసాగే ఈ రొమాంటిక్ డ్రామా కోసం యూర‌ప్‌ లోని వీధుల‌ను ఈ సెట్‌లోకి తీసుకొచ్చార‌ని తెలుస్తోంది. ఈ సెట్స్ పై చిత్రంలోని పలు కీల‌క స‌న్నివేశాల‌ చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ పోషించే రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది. హ‌స్త సాముద్రికం తెలిసిన వ్య‌క్తిగా ప్రభాస్ కనిపించనున్నాడని లేటెస్ట్ సమాచారం.

యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాహో సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X