మొన్న మహేష్, నేడు ప్రభాస్.. ఎవరైనా సరే మార్చుకోవాల్సిందే!
లాక్ డౌన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద మార్పులే తీసుకొచ్చింది. చాలా సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో నిర్మాతల జేబులకు షూటింగ్ దశలోనే చిల్లులు పడ్డాయి. ఇక విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. సినిమాలకు ముఖ్యమైన ఎపిసోడ్స్ విదేశాల్లో షూట్ చేయడం తప్పనిసరి అయినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక కొంతమంది స్క్రిప్ట్ లో చెంజెస్ చేస్తూ ఇక్కడే షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు.
రీసెంట్ గా దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూకే కంట్రీస్, లండన్ లలో షూట్ చేయాలని అనుకున్నారు. ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్లాన్ ప్రకారం షూటింగ్ చేయలేకపోతున్నారు.

అందుకే దర్శకుడు రాధాకృష్ణ హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలలో సెట్స్ వేసి షూటింగ్స్ పూర్తి చేయాలని కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. షెడ్యూల్ మారడంతో కొంత స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సాహో అనంతరం ప్రభాస్ చేస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నార్త్ లో కూడా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ వారి అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











